చవితికి.. ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

చవితికి.. ప్రత్యేక బస్సులు

Sep 11 2026 9:40 AM | Updated on Sep 11 2026 9:40 AM

● 5,400 సర్వీసులు నడిపేందుకు చర్యలు ● ప్రత్యేక రైళ్లు కూడా..

సాక్షి, చైన్నె : వినాయక చవితి పండుగ, వారాంతపు సెలవులను పురస్కరించుకుని, ప్రయాణికుల సౌకర్యార్థం చైన్నె నుంచి 5,400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రభుత్వ రవాణా సంస్థ ప్రకటించింది.ఈ బస్సులలో కిలాంబాక్కం నుంచి గురువారం 585 బస్సులు రోడ్కెక్కించామన్నారు.శుక్రవారం 1,255, శనివారం 1030 , ఆదివారం 650 బస్సులను ప్రత్యేకంగా నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. సాధారణ బస్సులతో పాటుగా ఈ ప్రత్యేక బస్సులు చైన్నెకు దక్షిణ దిక్కున ఉన్న కిలాంఆక్కం టెర్మినల్‌ నుంచి తిరువణ్ణామలై, తిరుచ్చి, కుంభకోణం, మధురై, నైల్లె, నాగర్‌కోవిల్‌, కన్యాకుమారి, తూత్తుకుడి, కోయంబత్తూర్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌ తదితర ప్రధాన ప్రాంతాలకు నడపనున్నారు.

కోయంబేడు నుండి..

కోయంబేడు బస్టాండ్‌ నుంచి శుక్ర, శనివారాలలో 240 చొప్పున,, ఆదివారం 105 బస్సులు తిరువణ్ణామలై, నాగపట్నం, హోసూరు, బెంగళూరు ప్రాంతాలకు నడిపేందుకు నిర్ణయిచారు. బెంగళూరు, తిరుప్పూర్‌, ఈరోడ్‌, కోయంబత్తూర్‌ నుండి కూడా వివిధ ప్రాంతాలకు 200 ప్రత్యేక బస్సులు కేటాయించారు. ఇక, మాధవరం నుండి శుక్ర, శని, ఆదివారాలలో కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, తిరుచ్చి, కుంభకోణం, వేలూరు, హోసూరు, పుదుచ్చేరి ప్రాంతాలకు రోజూ 110 ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించారు. ఇక, తిరుగు ప్రయాణం కోసం ఈనెల 15న ప్రయాణికులు చైన్నె తిరిగి వచ్చేందుకు వీలుగా వివిధ ప్రాంతాల నుంచి అదనంగా 765 ప్రత్యేక బస్సులను నడపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సెలవు రోజుల్లో ప్రయాణించడానికి ఇప్పటికే వేలాది మంది ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకున్నారు. ఇక, ఆమ్నీ ప్రైవేటు బస్సుల దోపిడికి కల్లెం వేసే దిశగా ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించారు.ఈ సారి వినాయక చవితికి శని, ఆదివారాలు కలిసి రావడంతో స్వస్థలాలకు చైన్నె వంటి నగరాల నుంచి జనం బయలుదేరి వెళ్తున్నారు. ఇక, దక్షిణ రైల్వే సైతం ప్రత్యేక రైలు సేవలకు సిద్ధమైంది. ఎగ్మూర్‌ – తిరునల్వేలి, ఎంజీఆర్‌ సెంట్రల్‌ – పోతనూరు మధ్య రైలు సేవలకు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement