అన్నాడీఎంకే అభ్యర్థుల ఖరారు | - | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే అభ్యర్థుల ఖరారు

Sep 11 2026 9:40 AM | Updated on Sep 11 2026 9:40 AM

ఉప ఎన్నికలలో తమ సిట్టింగ్‌స్థానాన్ని మళ్లీ కై వశం చేసుకునేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టారు. టీవీకే, డీఎంకే అభ్యర్థులను తలదన్నే రీతిలో బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు కార్యాచరణలో ఉన్నారు. స్థానికంగా బలమైన వ్యక్తులను ఎంపిక చేస్తున్నారు. వన్నియర్‌ సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉండటంతో పీఎంకే మద్దతుతో పళణి స్వామి గురువారం అభ్యర్థులను ప్రకటించారు. ఈ మేరకు మధురాంతంకంలో కనితా సంపత్‌, ధారాపురంలో భానుమతి పోటీ చేయనున్నారు. ఇక అన్నాడీఎంకే అభ్యర్థులకే తమమద్దతు అని బీజేపీ ప్రకటించింది. ఇక నామ్‌ తమిళర్‌ కట్చి నేత (ఎన్‌టీకే)సీమాన్‌ సైతం ఈ ఎన్నికలలో తమఅ భ్యర్థులను నిలబట్టేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలి ఎన్నికలలో ఓటమి పాలైన వారిని నిలబెట్టడమా.?? లేదా మరెవ్వర్ని అయినా బరిలో పెట్టడమా.? అన్న కసరత్తులో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈఎన్నికలలో తమ మద్దతు ఎవరికో అన్న విషయాన్ని శుక్రవారం సీపీఎం, సీపీఐలు ప్రకటించనున్నాయి.

కనితా సంపత్‌, భానుమతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement