నేడు మిత్రపక్షాలతో విజయ్‌ భేటీ | - | Sakshi
Sakshi News home page

నేడు మిత్రపక్షాలతో విజయ్‌ భేటీ

Sep 9 2026 12:17 AM | Updated on Sep 9 2026 12:17 AM

● దూరంగా ఉంటామన్న సీపీఎం ● సీఎం విజయ్‌ బ్రిటన్‌ పర్యటన రద్దయ్యేనా..?

సాక్షి, చైన్నె: సంకీర్ణ పార్టీలతో సీఎం విజయ్‌ బుధవారం పనయూరులో భేటీ కానున్నారు. ఈ భేటికి తాము దూరంగా ఉంటామని సీపీఎం నేతలు షణ్ముగం,బాలకృష్ణన్‌లు ప్రకటించారు. టీవీకే చీఫ్‌ విజయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి సీపీఎం, సీపీఐలు బయటి నుంచి, ఐయూఎంఎల్‌, కాంగ్రెస్‌, వీసీకేలో పాలనలో భాగమై మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. జూలైలలో సంకీర్ణ పార్టీలతో కలిసి కొత్త కూటమి దిశగా ప్రయత్నాలకు విజయ్‌ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జరిగిన సమావేశంలో సమన్వయ కమిటీ, కూటమికి కొత్త పేరు తదుపరి భేటిలో తీసుకునేందుకు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం పనయూరులో సమా వేశం నిమిత్తం అన్ని చర్యలు తీసుకున్నారు. మంత్రులు ఆనంద్‌, ఆదవ్‌ అర్జున, రాజ్‌ మోహన్‌ బృందం సీపీఎం, సీపీఐ, వీసీకే , కాంగ్రెస్‌, ఐయూఎంఎల్‌ పార్టీల నేతలను కలిసి ఈ సమావేశానికి ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఈ సమావేశానికి తాము హాజరు కావడం లేదని సీపీఎం నేతలు షణ్ముగం, బాలకృష్ణన్‌లు ప్రకటించడం చర్చకు దారి తీసింది. ఎలాంటి పరి స్థితుల్లోనూ టీవీకే మంత్రివర్గంలో చేరబోమని స్పష్టం చేశారు. టీవీకే తమ భాగస్వామ్య పక్షాలతో ఈ సమావేశం ఏర్పాటు చేసింది. తాుము ఆ కూట మిలో భాగం కాము అని, అందుకే వెళ్లడంలేదని ప్రకటించారు. వారు తీసుకునే నిర్ణయాలను బట్టి తదుపరి తమ అడుగులు ఉంటాయన్నారు. అదే సమయంలో ఈ భేటికి వెళ్లడం గురించి సీపీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నదో వేచి చూడాల్సిందే.

సఎం విజయ్‌ బ్రిటన్‌ పర్యటన రద్దు

మలేషియా ప్రధానమంత్రి అన్వర్‌ ఇబ్రహీం చైన్నెకి రానున్న నేపథ్యంలో, తమిళనాడు సీఎం విజయ్‌ తన బ్రిటన్‌ అధికారిక పర్యటనను వాయిదా వేసుకునే అవకాశం ఉందని సమాచారాలు వెలువడ్డాయి. మలేషియా ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు పర్యటనను వాయిదా వేసుకోవాలని గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ సీఎం విజయ్‌కి సలహా ఇచ్చినట్టు సమాచారాలు వెలువడ్డాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్‌ తొలిసారిగా ఈనెల 10 నుండి 16వ తేదీ వరకు ఇంగ్లాండ్‌లో పర్యటించి, బ్రిటన్‌లో జరిగే పెట్టుబడిదారులతో సమావేశాలలో పాల్గొనేందుకు నిర్ణయించారు. అయితే, ఈనెల 11 నుంచి 13 వరకు ఢిల్లీలో జరిగే బ్రిక్స్‌ సదస్సులో పాల్గొన్న అనంతరం మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం 13న చైన్నెకి రానున్నారు. ఇది వరకు విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన అన్వర్‌ ఇబ్రహీం, ఆయనను తన స్నేహితుడిగా సంబోధిస్తూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, తమిళనాడుకు వస్తానని తెలిపినట్లు సమాచారం. మలేషియా ప్రధాని అన్వర్‌తో భేటీకి గవర్నర్‌ సైతం మొగ్గు చూపిన నేపథ్యంలో సీఎం విజయ్‌ బ్రిటన్‌ పర్యటన వాయిదా పడేనా లేదా రద్దు అయ్యేనా అన్న సమాచారాలు వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement