పవన విద్యుత్‌ రంగంలో.. తయారీ హబ్‌గా తమిళనాడు | - | Sakshi
Sakshi News home page

పవన విద్యుత్‌ రంగంలో.. తయారీ హబ్‌గా తమిళనాడు

Sep 9 2026 12:17 AM | Updated on Sep 9 2026 12:17 AM

సాక్షి, చైన్నె: భారత పవన విద్యుత్‌ విప్లవంలో తమిళనాడు కేంద్రబిందువుగా మారుతోందని, దేశంలోనే అతిపెద్ద పవన విద్యుత్‌ రంగానికి సంబంధించిన తయారీ హబ్‌గా అవతరిస్తున్నట్టు విండర్జీ ఇండియా 2026 సదస్సులో ప్రకటించారు. 8వ ఎడిషన్‌కు సంబంధించి చైన్నె ట్రేడ్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న సదస్సు లో భాగంగా 3 రోజుల పాటుగా ప్రదర్శనకు చర్యలు తీసుకున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6.05 గిగావాట్ల పవన విద్యుత్‌ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు. జులై 31 , 2026 నాటికి దేశ మొత్తం సామర్థ్యం 58.14గిగా వాట్లకు చేరిందని సదస్సులో వివరించారు. 2030 నాటికి 100 గిగా వాట్ల లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయంగా పరిశ్రమలు పనిచేస్తున్నాయని, ప్రస్తుతం 43 గిగావాట్ల పనులు నిర్మాణ దశలో ఉన్నాయని ప్రకటించారు.

తమిళనాడు పాత్ర

విండర్జీ తయారీలో 70–80% దేశీయ పరికరాలే వాడుతున్నారని, ఇందులో తమిళనాడు స్పేర్‌ పార్ట్స్‌ , కాంపోనెంట్స్‌ తయారీదారుల నెట్‌వర్క్‌ ఎంతో కీలకంగా ఉన్నట్టు ప్రకటించారు. తమిళనాడులోని పాతబడిన పవన విద్యుత్‌ ప్లాంట్లను నవీకరించడం ద్వారా భారీగా విద్యుత్తును అదనంగా ఉత్పత్తి చేసే అవకాశం ఉందని వివరించారు. . దేశవ్యాప్తంగా ఉన్న 25.4 గిగావాట్ల సామర్థ్యంలో తమిళనాడుకు చెందిన 7.4 గిగా వాట్ల ఈ అప్‌గ్రేడేషన్‌కు అర్హత పొందిందని ప్రకటించారు. ఈ సదస్సులో ఐడబ్ల్యు టీఎంఏ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ శరవణన్‌ మాణిక్యం , సీఈఓ ఆదిత్య ప్యాసి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement