సమాజ అభివృద్ధికి విద్యే కారణం | - | Sakshi
Sakshi News home page

సమాజ అభివృద్ధికి విద్యే కారణం

Sep 9 2026 12:17 AM | Updated on Sep 9 2026 12:17 AM

తిరువళ్లూరు : సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన కారణమని, విద్యార్థుల చదువును నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళికబద్ధంగా తమ లక్ష్యసాధన కోసం కృషి చేయాలని ప్రముఖ అనలిస్టు జయప్రకాష్‌ ఏ. గాంధీ సూచించారు. తిరువళ్లూరు జిల్లా పుదువాయల్‌లోని ఆర్‌ఎంకే ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో ఇంజినీరింగ్‌ కోర్సులో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులను ఆహ్వానించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎంకే విద్యాసంస్థల వ్యవస్థాపక అద్యక్షుడు ఆర్‌ఎస్‌ మునిరత్నం అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా ప్రముఖ విద్యా వేత్త అనలిస్టు జయప్రకాష్‌ ఏ. గాంధీ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా జయప్రకాష్‌ గాంధీ మాట్లాడుతూ విద్యార్దుల భవిషత్తును ఉత్తమంగా తీర్చిదిద్దడంలో విధ్య మొక్క పాత్ర ప్రధానమన్నారు. డిజిటలైజ్డ్‌ ప్రపంచంలో బహుభాషా ప్రావీణ్యం ఉద్యోగ అవకాశాలను గణ నీయంగా ఎలా పెంచుతుందో వివరిస్తూ, విద్యార్థులు కేవలం ఇంజినీరింగ్‌ సబ్జెక్టులకు మాత్రమే పరిమితం కాకుండా విదేశీభాషలను నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్‌ జ్యోతినాయుడు, వైస్‌ఛైర్మన్‌ ఆర్‌ఎం కిషోర్‌, కార్యదర్శి యలమంచి ప్రధీప్‌ సలహాదారులు తమిళనాడు ఓపెన్‌ యూనివర్శిటీ మాజీ వీసి పళణిస్వామి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పిచ్చాండి, ప్రన్సిపల్‌ డాక్టర్‌ సురేష్‌కుమార్‌, డీన్‌ రామర్‌, శివరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement