క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Aug 30 2026 1:51 AM | Updated on Aug 30 2026 1:51 AM

స్టాలిన్‌కు ఇక ఎస్కార్ట్‌ భద్రతే

– జెడ్‌ ప్లస్‌ తొలగింపు

సాక్షి, చైన్నె : డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతను తొలగించారు. ఆయనకు ఇక ఎస్కాట్‌ భద్రత మాత్రమే కేటాయించనున్నారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు గత పదేళ్లుకు పైగా జెడ్‌ప్లస్‌ కేటగిరి భద్రతను కేటాయిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. 2021లో ప్రప్రథమంగా ఆయన సీఎం భద్రత చేపట్టినానంతరం కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య పెంచడమే కాదు, భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజాగా అధికారం దూరమైంది. టీవీకే చీఫ్‌ విజయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో స్టాలిన్‌ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఆయన ప్రస్తుతం మాజీ సీఎం, డీఎంకే అధ్యక్షుడు మాత్రమే. ఈ పరిస్థితులలో ఆయనకు కల్పించిన జెడ్‌ ప్లస్‌ భద్రతను ఉపసంహరించుకోవడం గమనార్హం. ఆయనకు ఇక, సాధారణ ఎస్కాట్‌ భద్రత మాత్రమే కేటాయించనున్నారు.

కల్తీసారా తరలించిన

ఆంధ్రా మహిళ అరెస్టు

పళ్లిపట్టు: కల్తీ సారా తరలించిన మహిళను శనివారం పళ్లిపట్టు పోలీసులు అరెస్టు చేశారు. పళ్లిపట్టు పుదుపట్టు బస్టాపు వద్ద శనివారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అటువైపు నడిచి వెళ్లిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా క్యాన్‌లో ఆరు లీటర్ల కల్తీ సారా తరలిస్తున్నట్లు గుర్తించి సీజ్‌ చేశారు. ఆ మహిళను పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. పళ్లిపట్టు ఎస్‌ఐ శివ చేపట్టిన దర్యాప్తులో నిందితులు ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని సీఆర్‌ కుప్పానికి చెందిన అములు(41)గా గుర్తించారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

పిడుగు పడి విద్యార్థి దుర్మరణం

తిరువొత్తియూరు: పుదుక్కోట్టై జిల్లా అరంతంగి తాలూకా మంజక్కరై దక్షిణ ప్రాంతానికి చెందిన పాండిత్తురై కుమారుడు యువరాసన్‌ ( 18). ఇతడు పుదుక్కోట్టై ప్రభుత్వ కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ పరిస్థితిలో, శుక్రవారం సాయంత్రం అరంతంగి, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో అకస్మాత్తుగా బలమైన గాలి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో మంజక్కరైకి చెందిన యువరాసన్‌ తన ఇంట్లో ఉన్న ఎద్దును పట్టుకుని కట్టేయడానికి బయటకు వెళ్లాడు. అప్పుడు అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఎద్దు సహా యువరాసన్‌ అక్కడికక్కడే మరణించాడు. నాగుడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం అరంతంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జాయింట్‌ రిజిస్ట్రార్‌

అకస్మిక తనిఖీలు

తిరువళ్లూరు: పూందమల్లిలోని వ్యవసాయ సహకార పరపతి సంఘంలో అదనపు రిజిస్ట్రార్‌ అకస్మిక తనిఖీలను నిర్వహించారు. ప్రాథమిక వ్యవసాయ సహాకార పరపతి సంఘం ద్వారా డ్వాక్రా సంఘాలు, రైతులు, డామ్‌కో, టాప్‌సెట్కో తదితర రుణాల పురోగతి, ఈ సేవా కేంధ్రాల నిర్వాహణ, శాఖపరమైన పనుల్లో సాధించిన పురోగతిపై ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తనీఖీలను విస్తృతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శనివారం ఉదయం తిరువళ్లూరు జిల్లా పూందమల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సహకారశాఖ అదనపు రిజిస్ట్రార్‌ సుబ్రమణియన్‌, జాయింట్‌ రిజిస్టర్‌ జయశ్రీతో పాటూ పలువురు సమీక్ష, తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రమణియన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డ్వాక్రా సంఘాలకు రుణాల పంపిణి, డామ్‌కో, టాప్‌సెట్కో రుణాల పంపిణీని మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు. తిరువళ్లూరు జాయింట్‌ రిజిస్టర్‌ జయశ్రీ, డిప్యూటి రిజిస్టర్‌లు అముధ(తిరుత్తణి), శివప్రకాష్‌(పొన్నేరి)కాంచీపురం సెంట్రల్‌ బ్యాంకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ శశికుమార్‌ పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,803 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,685 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.04 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement