మాతృభాషను పట్టించుకోకపోవడం శోచనీయం | - | Sakshi
Sakshi News home page

మాతృభాషను పట్టించుకోకపోవడం శోచనీయం

Aug 30 2026 1:51 AM | Updated on Aug 30 2026 1:51 AM

– కలైమామణి మాధవపెద్ది మూర్తి

కొరుక్కుపేట: తెలుగువారు తమ మాతృభాషను పట్టించుకోకపోవడం శోచనీయమని, ఈ తీరు మారాలని ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు కలైమామణి మాధవపెద్ది మూర్తి వ్యాఖ్యానించారు. ఈ మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 24వ అంతర్‌ పాఠశాల వార్షిక పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలైమామణి మాధవపెద్ది మూర్తి పాల్గొని విజేతలకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు విద్యార్థులకు ఇలాంటి పోటీలు పెట్టీ వాటి ప్రతిభను వెలికి తీయడం, తద్వారా తెలుగు భాషకు సమితి చేస్తున్న ఈ సేవ ఇలాగే కొనసాగాలని కోరారు. తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా తమ భాషను ఎక్కడా ఎవరూ మర్చిపోకుండా నేర్చుకుంటే, ఇక్కడున్న తెలుగువారు తమ మాతృభాషను పట్టించుకోకపోవడం శోచనీయమని, ఈ తీరు మారాలని అన్నారు. ఈనెల 7వ తేదీన స్థానిక ఆంధ్ర బాలానంద సంఘంలో జరిగిన పోటీల్లో మొత్తం 9 తెలుగు పాఠశాలల విద్యార్థులు పాల్గొని 51 మంది విజేతలకు బహుమతులను, ధ్రువపత్రాలు సమితి నిర్వాహకులు అందించారు. ముందుగా తెలుగుతల్లి ప్రార్థనతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షుడు డా. అజంతా కే, శంకరరావు అధ్యక్షత వహించారు. డీఆర్బీసీసీసీ హిందూ కళాశాల తెలుగు సహాయాచార్యులు డా. తుమ్మపూడి కల్పన, కార్యదర్శి దామెర్ల పద్మావతి, సహకార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement