సాక్షి, చైన్నె : కర్మయోగి కామరాజర్ అల్పాహార పథకం విస్తరణ అమలుకు చర్యలు చేపట్టారు. సెప్టెంబరు 17వ తేదిన పెరియార్ జయంతి సందర్భంగా విరుదు నగర్‌లో ఈ విస్తరణ పథకం అమలుకు సీఎం విజయ్ శ్రీకారం చుట్టనున్నారు. తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సీఎం అల్పాహారపథకంను డీఎంకే హయంలో అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.వి జయవంతంగా అమలులలో ఉన్న ఈ పథకానికి టీవీకే ప్రభుత్వం పేరు మార్చింది. కర్మయోగి కామరాజర్ అల్పాహార పథకం గా పేరు మార్చడమే కాకుండా ఈ పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరిస్తున్నట్లు సీఎం విజయ్ ప్రభుత్వం ప్రకటించి. ఈ పథకం అమలుకు బడ్జెట్‌లో రూ. 268 కోట్లు కేటాయించారు. ఈపరిస్థితులలో పెరియార్ జయంతి రోజైన సెప్టెంబర్ 17న ఈ పథకం విస్తరణను సీఎం విజయ్ అధికారికంగా ప్రారంభించనున్నారు. విరుదునగర్‌లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్మయోగి కామరాజర్ చదువుకున్న కే.వి.ఎస్. మిడిల్ స్కూల్‌లో ఈ విస్తరణ కార్యక్రమాన్ని సీఎం విజయ్ ప్రారంభించనున్నట్లు సమాచారాలు వెలువడ్డాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ దక్షిణ తమిళనాడు జిల్లాల్లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


