ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

Aug 23 2026 1:34 AM | Updated on Aug 23 2026 1:34 AM

కొరుక్కుపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్‌ సి. విజయ్‌ నేతత్వంలోని టీవీకే ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చైన్నె ఆర్కే నగర్‌ నియోజకవర్గం 41వ డివిజన్‌, కార్నేషన్‌ నగర్‌ తెలుగు బాప్టిస్ట్‌ చర్చిలో శనివారం ఉదయం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉత్తర చైన్నె జిల్లా మెంబర్‌షిప్‌ వింగ్‌ కార్యదర్శి ఎన్‌. అఖిలేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని ఉత్తర చైన్నె జిల్లా టీవీకే కార్యదర్శి జి. సూరవేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జి. సూరవేలు మాట్లాడుతూ, టీవీకే ప్రభుత్వం ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉందని, 100 రోజుల పాలన అందుకు నిదర్శనమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రజాసేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.శిబిరంలో బీపీ, షుగర్‌తో పాటు సాధారణ వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ నాయకులు అజారుద్దీన్‌, డివిజన్‌ కార్యదర్శి బాలాజీ, జిల్లా నాయకులు మహేశ్వరన్‌, వి.వి. తమిళ్‌, ఎస్‌.ఆర్‌. కిరుబా, ఏ. రమేష్‌, పి. రామకృష్ణ, పి. చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement