సైక్లింగ్‌ టూరిజానికి ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

సైక్లింగ్‌ టూరిజానికి ప్రోత్సాహం

Aug 23 2026 1:34 AM | Updated on Aug 23 2026 1:34 AM

● చైన్నెలో ఫ్‌లై అండ్‌ రైడ్‌

సాక్షి, చైన్నె: చైన్నెలోని టూరిజం మలేషియా కార్యాలయం, దయాశక్తి ట్రావెల్‌ – టూర్స్‌, ట్రాన్స్‌వెల్‌ ఇంటర్నేషనల్‌ భాగస్వామ్యంతోఫ్‌లై అండ్‌ రైడ్‌ వీవోఎల్‌ 2 జెర్సీ ఆవిష్కరణ , సైక్లింగ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. మలేషియా విజిట్‌ 2026–2027 ప్రచారంలో భాగంగా ఇండియన్‌ సైక్లిస్టులను, అడ్వెంచర్‌ ప్రియులను ఆకట్టుకునేలా ఈ ప్రత్యేక సైక్లింగ్‌ టూర్‌ ప్యాకేజీని రూపొందించారు. ఈ కార్యక్రమానికి చైన్నెలోని మలేషియా కాన్సుల్‌ జనరల్‌ కె. శరవణ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరవ్వగా, టూరిజం మలేషియా (చైన్నె) డైరెక్టర్‌ హిషాముద్దీన్‌ ముస్తఫా, దయాశక్తి ట్రావెల్స్‌ డైరెక్టర్‌ దాతో ఎస్‌. చంద్రన్‌ సుబ్బయ్య, ట్రానన్స్‌వెల్‌ సీఈఓ విష్ణు సి.ఎస్‌ పాల్గొన్నారు. 28 కి.మీ. సైక్లింగ్‌ ర్యాలీ: మలేషియా కాన్సులేట్‌ జనరల్‌ బందంతో సహా 50 మందికి పైగా రైడర్లు పాల్గొని 28 కిలోమీటర్ల మేర సైక్లింగ్‌ చేశారు. అనంతరం అధికారికంగా ఫ్‌లై అండ్‌ – రైడ్‌ సైక్లింగ్‌ జెర్సీని ఆవిష్కరించారు. భారతీయ సైక్లిస్టుల కోసం రూపొందించిన ఈ టూర్‌ సెప్టెంబర్‌ 6 నుండి 13 వరకు జరుగుతుందని, ఇందులో భాగంగా మలేషియాలో 400 కిలోమీటర్లకు పైగా సైక్లింగ్‌ మార్గాన్ని కవర్‌ చేస్తారని ఈసందర్భంగా కాన్సుల్‌ వర్గాలు వివరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement