నేటి సీఎం... భవిష్యత్తు పీఎం | - | Sakshi
Sakshi News home page

నేటి సీఎం... భవిష్యత్తు పీఎం

Aug 23 2026 1:34 AM | Updated on Aug 23 2026 1:34 AM

● సీఎం విజయ్‌ గురించి మంత్రి జగదీశ్వరి వ్యాఖ్యలు

సాక్షి, చైన్నె: ‘తమిళనాడు నేటి సీఎం... దేశానికి కాబోయే భవిష్యత్తు పీఎం..! ఆ దిశగానే మనం పయనిద్దాం’ అని తమిళనాడు సామాజిక సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. విరుదునగర్‌ సమీపంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలో కార్మిక సంక్షేమ , నైపుణ్యాభివృద్ధి శాఖ, గ్రామీణ, పట్టణ జీవనోపాధి మిషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ప్రైవేట్‌ ఉద్యోగ మేళా ముగింపు కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు ఈ ఉద్యోగ మేళాలో 150కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొనగా, విరుదునగర్‌ జిల్లా పరిధిలోని 2,000 మందికి పైగా యువతీ యువకులు హాజరయ్యారు. ఎంపికై న 100 మందికి పైగా అభ్యర్థులకు జిల్లా కలెక్టర్‌ సుగపుత్ర అధ్యక్షతన జరిగినకార్యక్రమంలో మంత్రులు కీర్తన , జగదీశ్వరి నియామక పత్రాలను అందజేశారు. ఈసందర్భంగామంత్రి జగదీశ్వరి ప్రసంగిస్తూ, తమిళనాడులో అవినీతి రహిత పాలన అందిస్తామని సీఎం విజయ్‌ స్పష్టం చేశారన్నారు. ఉద్యోగం కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వొద్దు. మీ అర్హతలు, నైపుణ్యాలను పెంచుకుని ఉద్యోగాలు సాధించాలి అని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 323 ఉద్యోగ మేళాలు నిర్వహించామని, 5.93 లక్షల మంది నమోదు చేసుకోగా, 13,434 కంపెనీల ద్వారా 58,000 మందికి ఉద్యోగాలు లభించాయని వివరించారు. ప్రస్తుత సీఎం విజయ్‌ భవిష్యత్తులో దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కీర్తన మాట్లాడుతూ, టీవీకే ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన కేవలం 3 నెలల్లోనే రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్నారు. విరుదునగర్‌లోని పీఎం మిత్రా టెక్స్‌టైల్‌ పార్క్‌లో రూ. 1,600 కోట్ల వ్యయంతో 2 భారీ పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. దీనివల్ల వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని, శ్రీవెట్రి తమిళనాడుశ్రీ పథకం ద్వారా యువత కేవలం ఉద్యోగాలు వెతికేవారిగానే కాకుండా, ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement