తిరువళ్లూరు: విద్యార్థుల్లో ఉన్న కళాత్మక ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే జిల్లా స్థాయి కళల పోటీలను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కవిత తెలిపారు. 2026–27 సంవత్సరంగాను కళల ఉత్సవ పోటీలను యువ నైపుణ్యాలు పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఐదు విభాగాలలో పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో జిల్లాలోని 106 ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు పోటీల్లో పాల్గోంటున్నారు. ఈక్రమంలో ఎయిడెడ్ పాఠశాల మద్య డీఆర్‌బీసీసీసీ జరుగుతున్న పోటీలను శనివారం ఉదయం కలెక్టర్ కవిత పరిశీలించారు. అనంతరం ఉత్తమ ప్రధర్శన ఇచ్చిన విద్యార్దులకు బహుమతులను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ అముధ, పన్నీర్‌సెల్వం, సమీకృత పాఠశాల విధ్య అధికారి పరమేశ్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామ్మోహన్, తాహశీల్దార్ శరణ్య పాల్గొన్నారు.


