కొరుక్కుపేట: కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల, వివిధ కళాశాలల విద్యార్థులను ఒకచోట చేర్చి, వారి విద్యా నైపుణ్యం, సృజనాత్మకత , కళాత్మక ప్రతిభను ప్రదర్శించేందుకు చైతన్య మెగా ఇంటర్–కాలేజియేట్ కల్చరల్ ఫెస్ట్ 2026–2027ను విజయవంతంగా నిర్వ హించారు. తొలిరోజు మంగళవారం వివిధ విభాగాలచే అంతర్ కళాశాల విద్యా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. విద్యార్థులు తమ జ్ఞానం, మేధో సామర్థ్యాలు, భావప్రసార నైపుణ్యాలు, వినూత్న ఆలోచనా విధానాన్ని ప్రదర్శిస్తూ, ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గురు నానక్ కళాశాల తన అద్భుతమైన ప్రదర్శనతో అగ్రస్థానాన్ని కై వసం చేసుకుని, విద్యా కార్యక్రమాల విజేతగా నిలిచింది..బుధవారం సాంస్కృతిక కార్యక్రమాలలో పూలగుత్తుల తయారీ, ఆభరణాల తయారీ, రీల్స్ తయారీ వంటి కార్యక్రమాల తో పాటు, సమూహ గానం, సమూహ నృత్యం వంటి ఉత్సాహభరితమైన వేదికపై కార్యక్రమాలు జరిగా యి. సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలో అద్భుతమై న ప్రతిభ కనబరిచిన అన్నా ఆదర్శ మహిళా కళాశాల సాంస్కృతిక కార్యక్రమ విజేతగా నిలిచింది. అద్భుతమైన సమగ్ర ప్రదర్శన కనబరిచినందుకు గాను, అన్నా ఆదర్శ్ మహిళా కళాశాలకు ఓవరాల్ ట్రోఫీని ప్రదానం చేయడంతో ఈ ఉత్సవం ముగిసింది.


