‘అమరం’ నిర్మించడానికి ధైర్యం కావాలి | - | Sakshi
Sakshi News home page

‘అమరం’ నిర్మించడానికి ధైర్యం కావాలి

Aug 20 2026 3:34 AM | Updated on Aug 20 2026 3:34 AM

తమిళసినిమా: దివ్య క్షేత్ర ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మల రాజన్‌ సమర్పణలో సీఆర్‌ రాజన్‌ నిర్మించిన చిత్రం అమరం. దీనికి అరుళ్‌ కృష్ణన్‌ కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. ఈయన దర్శకుడు గోకుల్‌, రాజన్‌ మాధవ్‌ వద్ద సహాయ దర్శకుడిగా పరిచయం చేశారు. ఈచిత్రంలో తేజస్‌ రాజన్‌,ఐరా అగర్వాల్‌ హీరోయిన్గా నటించారు. జార్జ్‌, సాయిదీనా, నాగినీడు, కల్కీ రాజన్‌, హరీష్‌ పెరాడి, వాసుదేవన్‌ మురళి ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అమరం చిత్రం ఈ నెల 28న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్‌ ఆవి ష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌ లో నిర్వహించారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సీఆర్‌.రాజన్‌ మాట్లాడుతూ ఎవరైనా మంచి చిత్రం చేయాలనే ఆశిస్తారనీ, అయితే అందుకు కళాకారుల శ్రమ, అంకిత భావం అవసరం అవుతుందన్నారు. అది కొన్ని చి త్రాలకే అమరుతుందన్నారు. అలాంటి శ్రమ, అంకిత భావం కళాకారుల నుంచి తమకు పూర్తిగా లభించింది అని చెప్పారు. ఈ చిత్ర కథను దర్శకుడు చెప్పగానే తమ కుటుంబంలోని అందరికీ నచ్చిందని, దీంతో వెంటనే చిత్రం చేయాలని భావించినట్లు చెప్పా రు. తాను సినీ ప్రయాణం సుదీర్గం అని దర్శకుడు అరుళ్‌ కృష్ణన్‌ పేర్కొన్నారు. తాను చాలా కాలంగా ఈ రంగంలో కొనసాగుతున్నట్లు చెప్పారు. తాను దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌, శంకర్‌ వంటి వారిని చూసి ఈ రంగంలో వచ్చినట్లు చెప్పా రు. అమరం వంటి చిత్రాన్ని చేయడానికి నిర్మాతకు ధైర్యం కావాలి అన్నారు.ఆ ధైర్యం ఈ చిత్ర నిర్మాతకు ఉండటం వల్లే ఇది సాధ్యమైంది అని దర్శకుడు పే ర్కొన్నారు. ఇది మూడు తరాల కు చెందిన మూడు ప్రాంతాల్లో జరిగే వైవిధ్య భరిత కథా చిత్రం అని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement