కొన్ని చిత్రాలు షూటింగ్‌ పూర్తి అయినా.. | - | Sakshi
Sakshi News home page

కొన్ని చిత్రాలు షూటింగ్‌ పూర్తి అయినా..

Aug 20 2026 3:34 AM | Updated on Aug 20 2026 3:34 AM

మంచి కథా చిత్రాలను ఆదరిస్తారు.!

తమిళసినిమా: తెలుగులో భారీ బడ్జెట్‌ చిత్రాలతో పాటు మంచి కంటెంట్‌ తో కూడిన చిన్న చిత్రాలను నిర్మిస్తూ విజయాలను అందుకుంటున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌. ఈ సంస్థ అధినేతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ తాజాగా తమిళంలో నిర్మించిన చిత్రం మొద రాతిరి. రాజా కరుప్పుసామి కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రంలో రిషీకాంత్‌, నటి అనీష్మా అనిల్‌ కుమార్‌ జంటగా నటించారు. ఏ.వెంకటేశ్‌, భగవతి పెరుమాళ్‌, భానుమతి, సుమిత్రా దేవి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. భరత్‌ శంకర్‌ సంగీతాన్ని,సురేంద్రన్‌ పరంజ్యోతి ఛాయాగ్రహణం అందించిన ఈ వినోదంతో కూడిన వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నవీన్‌ ఎర్నేని,వై.రవిశంకర్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ‘‘తమిళ ప్రేక్షకుల అభిరుచి మారింది. మంచి కంటెంట్‌ తో కూడిన వైవిధ్య భరిత కథా చిత్రాలను తమిళ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇందుకు చిన్న ఉదాహరణ ఇటీవల విడుదలైన ఆయ్‌ కళవి, యూత్‌ , బ్లాస్ట్‌ వంటి చిత్రాల విజ యాలే. బ్రహ్మాండమైన ఇండియన్‌ చిత్రాలు నుంచి మంచి కంటెంట్‌ కలిగిన చి న్న చిత్రాలు నిర్మించడానికి మా సంస్థ ఎప్పుడూ సిద్ధం. అలా తాజాగా తాము చాలా నమ్మకంతో తమిళంలో నిర్మించిన వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రం మొద రాతిరి. శుక్రవారం విడుదల అవుతున్న ఈ చిత్రం విజయంపై చాలా నమ్మకంతో ఉన్నాం. నటుడు రిషీకాంత్‌, నటి అనిష్మా అనిల్‌ కుమార్‌ నుంచి అందరూ చాలా బాగా నటించారు. దర్శకుడు రాజా కరుప్పుసామి చాలా తెలివిగా, క్లియర్‌గా కథను తెరకెక్కించిన విధానం మాకు నచ్చింది ‘‘అని పేర్కొన్నారు. కాగా ఈ సంస్థ తెలుగులో రవితేజ హీరోగా నిర్మించిన ఇరుముడి గురువారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement