కావేరి, మేఘదాతు వ్యవహారంపై..! | - | Sakshi
Sakshi News home page

కావేరి, మేఘదాతు వ్యవహారంపై..!

Aug 19 2026 12:30 AM | Updated on Aug 19 2026 12:30 AM

● సీఎం విజయ్‌తో చర్చలకు డి.కె.శివకుమార్‌ ప్రణాళిక ● ఎన్నికల పిటిషన్‌ కొట్టివేత ● హైకోర్టు తీర్పు

సాక్షి, చైన్నె:కావేరీ నదీ జలాల పంపిణీ, వివాదాస్ప ద మేఘదాతు ఆనకట్ట నిర్మాణ ప్రతిపాదనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో భేటీ అయి చర్చలు జరిపేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ ప్రణాళిక రచిస్తున్నారన సంకేతాలు వెలువడ్డాయి.చైన్నెలో జరగనున్న దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సమావేశం నిర్వహించేందుకు ప్రతిపా దనలు సిద్ధమవుతున్నాయన్న చర్చజరుగుతోంది.

కావేరీ జలాల పంపిణీపై ఉత్కంఠ

ప్రస్తుత వర్షాకాలంలో తమిళనాడుకు రావలసిన కావేరీ నీటి వాటాను కర్ణాటక సకాలంలో విడుదల చేయకపోవడం, మేటూరు జలాశయంలో నీటిమట్టం పడిపోవడంతో డెల్టా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే,కావేరీ నదిపై మేఘదాతు వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించేందుకు కర్ణాటక చేస్తున్న ప్రయత్నాలను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దిగువన ఉన్న తమిళనాడు హక్కులకు భంగం వాటిల్లే ఎలాంటి ప్రాజెక్ట్‌ను అనుమతించేది లేదని సీఎం విజయ్‌ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టం చేశారు. అయితే, తాగునీటి అవసరాల కోసమే మేఘదాతు ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని, ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం స్థాయి చర్చలు ఉపకరిస్తాయని కర్ణాటక ప్రభుత్వం భావిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కావేరీ నదీ జలాల నిలకడ , రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. బుధ,గురువారాలలో ఈ భేటి జరిగేనా లేదా, ఈ సదస్సు ముగిసినానంతరం శుక్రవారం జరిగేనా అన్న చర్చజరుగుతోంది.అయితే, ఇది కార్యరూపం దాల్చేనా అన్నది వేచిచూడాల్సిందే.

సీఎం విజయ్‌ 100 రోజుల పాలనపై చర్చ

– ఇండియా టుడే యూట్యూబ్‌ ఛానల్‌

సాక్షి,చైన్నె: తమిళనాడు రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, పాలన, అభివృద్ధి భవిష్యత్తుపై చర్చించేందుకు ఇండియా టుడే నిర్వహించిన ‘ఇండియా టుడే తమిళనాడు రౌండ్‌టేబుల్‌’ సదస్సు చైన్నెలో జరిగింది. మే నెలలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం విజయం సాధించి అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సి. జోసెఫ్‌ విజయ్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభం: టీవీకే ప్రభుత్వ 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇండియా టుడే గ్రూప్‌ డిజిటల్‌ ప్రాంతీయ వేదిక తమిళ యూ ట్యూబ్‌ ఛానల్‌ను సీఎం విజయ్‌ ప్రారంభించారు. నిజమైన , విశ్వసనీయమైన జర్నలిజానికి ప్రాధాన్యత ఇవ్వాలని, సమాజంలో నిజం ఎల్లప్పుడూ బలంగా వినిపించాలని విలేకరులకు మీడియా సంస్థలకు సీఎం విజయ్‌ సూచించారు. అనంతరం జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో విది లీడర్స్‌ వ్యవస్థాపకుడు అన్నామలై రాజకీయ ప్రయాణం, సినీ నటుడు ధ్రువ్‌ విక్రమ్‌ తన నటనా ప్రయాణం, సీఎం విజయ్‌ పై తనకున్న అభిమానం, తన తండ్రి విక్రమ్‌తో అనుబంధం ,సినీ పరిశ్రమలోని వారసత్వ అంశాలపై స్పందించారు. ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆధవ్‌ అర్జున, ఆర్థిక మంత్రి ఎన్‌.ఎం. మరియా విల్సన్‌, ఎంపీలు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని విద్యా, వైద్యం, రవాణా ,తాగునీటి రంగాలలో తమిళనాడు సాధిస్తున్న పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు.

ఊత్తంగరై టీవీకే ఎమ్మెల్యేకు ఊరట

సాక్షి, చైన్నె: కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై అసెంబ్లీ నియోజకవర్గం టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఊత్తంగరై నియోజకవర్గానికి చెందిన గీత అనే ఓటరు, ఇళయరాజా విజయానికి వ్యతిరేకంగా చైన్నె హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌లో ఇళయరాజా పేరుకు బదులుగా మరొకరి పేరు నమోదై ఉండటంతో సవరణ పిటిషన్‌ దాఖలు చేయాలని కోర్టు గతంలో ఆదేశించింది. ఈ పరిణామాల మధ్య, తనపై దాఖలైన ఈ ఎన్నికల పిటిషన్‌ను ప్రాథమికంగానే తిరస్కరించాలని కోరుతూ టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ డి. భరత చక్రవర్తి, మంగళవారం ఎమ్మెల్యే ఇళయరాజాకు అనుకూలంగా తీర్పునిస్తూ పిటిషన్‌ను తిరస్కరించారు.

కావేరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement