పుదుచ్చేరి అసెంబ్లీలో.. తమిళ్‌ తాయ్‌ వాల్తు | - | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరి అసెంబ్లీలో.. తమిళ్‌ తాయ్‌ వాల్తు

Aug 19 2026 12:30 AM | Updated on Aug 19 2026 12:30 AM

–తాత్కాలిక స్పీకర్‌ అన్బళగన్‌ స్పష్టీకరణ

సాక్షి, చైన్నె: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల మాదిరిగానే శాసనసభ మొదటి రోజున తమిళ్‌ తాయ్‌ వాళ్త్తు (తమిళ తల్లిగీతం) పాడటానికి కచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామని, ఇది తమ హక్కు అని పుదుచ్చేరి శాసనసభ తాత్కాలిక స్పీకర్‌ అన్బళగన్‌ ఽ స్పష్టం చేశారు. పుదుచ్చేరి తాత్కాలిక స్పీకర్‌ అన్బళగన్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, శాసనసభ్యుల కోసం ప్రత్యేక పునశ్చరణ తరగతులు, రాబోయే అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్ల గురించి వివరాలను వెల్లడించారు. కాగా అసెంబ్లీ మొదటి రోజున మొదటగా తమిళ్‌ తాయ్‌ వాల్తు పాడాలని ప్రతిపక్ష నాయకుడు నజీమ్‌ లేఖ రాశారని, దీనిపైదృష్టి పెట్టే విధంగా ఎమ్మెల్యే నెహ్రూ ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారని అన్బళగన్‌ తెలిపారు. తమిళ తల్లిని అభినందించేందుకు ప్రత్యేకంగా ఎలాంటి తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని, దీనికి సంబంధించి ఇప్పటికే పలు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు అందుబాటులో ఉన్నాయన్నారు. పుదుచ్చేరిలో జరిగే అధికారిక వేడుకల్లో తమిళ తల్లి గీతానికి ముఖ్యమంత్రి రంగస్వామి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తారన్నారు. ఇది తమ హక్కు, దీనికోసం తీర్మానాలు అక్కర్లేదని ఆయన వివరించారు.

అన్భళగన్‌

24న గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ

ఈనెల 24వ తేదీన గవర్నర్‌ ప్రసంగంతో పుదుచ్చేరి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయని ప్రకటించారు. ఆ రోజు సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యే ముందు మొదటగా తమిళ్‌ తాయ్‌ వాల్లు ఆలపిస్తారని, ఆ బాధ్యతను ముఖ్యమంత్రే స్వయంగా చూసుకుంటారని తాత్కాలిక స్పీకర్‌ అన్బళగన్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement