వేలూరు సీఎంసీ ఆసుపత్రి రోడ్డులో ఆక్రమణల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

వేలూరు సీఎంసీ ఆసుపత్రి రోడ్డులో ఆక్రమణల తొలగింపు

Aug 19 2026 12:30 AM | Updated on Aug 19 2026 12:30 AM

వేలూరు: వేలూరు పట్టణంలోని తరచూ ట్రాఫిక్‌తో సతమతం అవుతున్న రోడ్డులో వేలూరు సీఎంసీ ఆసుపత్రి రోడ్డు ఒకటి. ఈ రోడ్డులో తరచూ వివిధ ప్రాంతాల నుంచి సీఎంసీ ఆసుపత్రికి వచ్చిన రోగులు, బందువులు, వాహణ దారులతో తరచూ రద్దీగానే ఉంటుంది. ఈ నేపద్యంలో వేలూరు గ్రీన్‌ సర్కిల్‌ ప్రాంతంలో భూగర్బ సబ్‌వే పనులు జరుగుతున్న నేపద్యంలో ప్రస్తుతం సత్‌వచ్చారి నుంచి వేలూరుకు వచ్చే వాహణాలు సైతం సీఎంసీ రోడ్డు మీదుగానే వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సీఎంసీ రోడ్డులో ట్రాపిక్‌ మరింతగా పెరిగింది. ఇదిలా ఉండగా సీఎంసీ ఆసుపత్రి రోడ్డులో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలని, రోడ్డు పక్కన ఉన్న వాహణాలు తొలగించి దుకాణాల ఆక్రమణలు తొలగించాలని పలువురు కోరారు. దీంతో వేలూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ ఆక్రమణలు వెంటనే తొలగించాలని ఆదేశించారు. దీంతో మంగళవారం ఉదయం కార్పొరేషన్‌ ఆరోగ్యశాఖ అధికారి బాలమురుగన్‌, కార్పొరేషన్‌ అధికారులు వెంకటేశన్‌లు పోలీసుల బందోబస్తు నడుమ జేసీబీ యంత్రంతో ఆక్రమణలు తొలగించి రోడ్డు పక్కన ఉన్న ఆగ్రమ దుకాణాలను పూర్తిగా లారీలో అక్కడ నుంచి తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement