కొరుక్కుపేట: ఎస్‌కేపీడీ హాస్టల్ అలూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల వార్షిక సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. దీనికి చైన్నె జార్జిటౌన్‌లోని ఎస్‌కేపీడీ కన్వెన్షన్ సెంటర్ వేదికై ంది. అసోసియేషన్ ప్రెసిడెంట్ టి. జగదీష్‌బాబు సభకు అధ్యక్షత వహించి అసోసియేషన్ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ట్రస్టీ డాక్టర్ తవ్వ వేదగిరీశ్వర రావు, టస్టీలు తాతా బద్రీనాథ్, సి. ఆర్. కిషోర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ తవ్వ వేదగిరీశ్వర రావు మాట్లాడుతూ వాసవీ అమ్మవారి ఆశీస్సులతో ఎస్ కె పి డి హాస్టల్ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ఆందోళనవ్యక్తం చేశారు. సుమారు 100 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌కేపీడీ హాస్టల్‌కు విరాళంగా రూ.75 వేలు విలువతో స్టీల్ కబ్ బోర్డు, ప్లాస్టిక్ చెర్‌లు, ఇంటర్ నెట్ వసతి, తదితర ఏడు రకాల సహాయకాలను అతిథులతో కలసి జగదీష్ బాబు, ఎంఏ నరసింహన్, గుర్రం బాలాజీ, ఎస్. రాముడు, ఎంకే రవీంద్రన్, కె.గోపాల శెట్టి లు అందజేశారు. కార్యక్రమంలో ముందుగా వాసవాంబను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.


