మినిమల్లీ ఇన్‌వేసివ్‌ హార్ట్‌ కేర్‌కు పెరిగిన ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

మినిమల్లీ ఇన్‌వేసివ్‌ హార్ట్‌ కేర్‌కు పెరిగిన ప్రాధాన్యత

Jul 23 2026 1:54 AM | Updated on Jul 23 2026 1:54 AM

సాక్షి, చైన్నె: అత్యాధునిక గుండె చికిత్సల్లో చైన్నె నగరం భారతదేశంలోనే ప్రముఖ కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. నగరంలో గుండె వాల్వ్‌ చికిత్సలు ఏటా దాదాపు 30శాతం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం చైన్నెలో ప్రతీ సంవత్సరం సుమారు 400కి పైగా సంక్లిష్ట గుండె వాల్వ్‌ సర్జరీలు జరుగుతున్నాయి. చైన్నెలో బుధవారం శ్రీరామచంద్ర మెడికల్‌ సెంటర్‌ ప్రాఫెసర్‌ ఆఫ్‌ కార్డియాలజీ డాక్టర్‌ నాగేంద్ర భూపతి అధ్యక్షతన జరిగిన సదస్సులో వక్తలు, వైద్యులు వివరిస్తూ, దాదాపు 7 సంవత్సరాల అంతర్జాతీయ పరిశోధన డేటా ప్రకారం, ఈ అత్యాధునిక చికిత్సల వలన మెరుగైన ఫలితాలు వస్తున్నాయని తేలడంతో వైద్యుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. రోగులు కూడా చికిత్స తీసుకునే ముందు వివిధ మార్గాల ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకుని సరైన నిర్ణయాలు తీసుకుంటున్నార న్నారు. కేవలం దక్షిణ భారతదేశం నుంచే కాకుండా ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల నుండి కూడా రోగులు ప్రత్యేక గుండె చికిత్సల కోసం చైన్నెకి వస్తున్నారని వివరించారు. చైన్నెలోని ప్రముఖ బోధనాసుపత్రుల్లో ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టులు, కార్డియాక్‌ సర్జన్లు కలిసి ఉమ్మడిగా హార్ట్‌ టీమ్‌గా చికిత్సా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement