వైభవంగా వీరరాఘఽవుడి ఆణిమాసం తెప్పోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా వీరరాఘఽవుడి ఆణిమాసం తెప్పోత్సవం

Jul 16 2026 5:18 AM | Updated on Jul 16 2026 5:18 AM

వైభవంగా వీరరాఘఽవుడి ఆణిమాసం తెప్పోత్సవం విద్యతోనే బంగారు భవిత చైన్నెలో ఆవిన్‌ పాలకు డిమాండ్‌

తిరువళ్లూరు: తిరువళ్లూరులో ప్రసిద్ధి చెందిన శ్రీ వైద్య వీరరాఘవుడి ఆలయంలో ఆణిమాసం తెపోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సాయంత్రం స్వామి వారు శ్రీదేవి భూదేవిలతో కలిసి ప్రత్యేక అలంకరణలో పుష్కరిణికి వచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు అందుకున్న తరువాత మూడు రౌండ్లు పుష్కరిణిలో స్వామి వారు విహారించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు పుష్కరిణిలో తెప్పాన్ని లాగి తమ మొక్కుబడిని చెల్లించుకున్నారు.

కొరుక్కుపేట: విద్యతోనే బంగారు భవిత అందుతుందని అతిధులుగా పాల్గొన్న టి.గోపాలకష్ణ, బిట్రా గజగౌరిలు అభిప్రాయ పడ్డారు. చైన్నె ప్యారీస్‌ గోవిందప్పనాయకన్‌ వీధిలో ఉన్న ఎస్‌ కేపీడీ బాలుర మహోన్నత పాఠశాలలో కామరాజర్‌ 124వ జయంతిని బుధవారం విద్యా దినోత్సవంగా జరుపుకున్నారు. ఎస్‌ కె పీడీ పాఠశాలల కరస్పాండెంట్‌ ఎస్‌ఎల్‌ సుదర్శనం అధ్యక్షత జరిగిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా కేంద్రప్రభుత్వ విద్యాశాఖ రిటైర్డ్‌ జాయింట్‌ కమిషనర్‌ టి.గోపాలకష్ణ, విశిష్ట అతిథిగా ఆల్‌ ఇండియా రేడియో రిటైర్డ్‌ సీనియర్‌ తెలుగు అనౌన్సర్‌ బిట్రా గజగౌరిలతో కలసి ప్రధానోపాధ్యాయులు ఓరుగంటి లీలారాణి, ఈ.రమేష్‌ , ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి కామరాజర్‌ చిత్రపటానికి పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ మద్రాస్‌ యూనిట్‌ చైర్పర్సన్‌ ప్రశాంతి సతీష్‌ 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు స్పోకెన్‌ ఇంగ్లీష్‌ క్లాసులను ప్రారంభించారు. ఈ వేడకల్లో విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేసి అతిథులను సత్కరించారు.

సాక్షి, చైన్నె: రాజధాని చైన్నె, శివారులల్లాలో గత వారం రోజులుగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆవిన్‌ పాలకు తీవ్ర డిమాండ్‌ ఏర్పడింది. ప్రైవేటు పాలధరలు పెరిగిన నేపథ్యంలో ఆవిన్‌ కొనుగోలు పెరిగాయి. దీంతో దుకాణాలలో ఆవిన్‌ పాలకు కోరత ఏర్పడింది. ప్రైవేటు పాల తయారీ సంస్థలు లీటరుకురూ. 4 ధర పెంచిన విషయం తెలిసిందే. దీంతో తక్కువధరకే లభించిన ఆవిన్‌ను కొనుగోలుచేసే వారిసంఖ్య పెరిగింది. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పాలు సరఫరా దుకాణాలు రాగానే, క్షణాల లో అమ్ముడై పోతుండటంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement