– మహిళ సహా ముగ్గురు దుర్మరణం
సాక్షి చైన్నె: తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నత్తంపట్టి వద్ద ఫోర్–లేన్ హైవే డివైడర్‌ను ఓ కారు బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు (ఒక మహిళ సహా) మరణించారు. ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
బాధితుల నేపథ్యం..
విరుదునగర్ జిల్లా వత్తిరాయిరుప్పు మేలపాళయం ప్రాంతానికి చెందిన చేర్వై (49) తన కుటుంబం మరియు స్నేహితులతో కలిసి శివగంగ జిల్లా మరుదంగుడిలోని ఒక గుడికి వెళ్లారు. అక్కడ పూజలు ముగించుకుని కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డ్రైవర్ భూపతి (26), కార్తీక్ (38) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన అంగాళ ఈశ్వరి (30)ని ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
క్షతగాత్రులు: ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చేర్వై, ఆయన భార్య వీరలక్ష్మి (45)ని మెరుగైన చికిత్స కోసం విరుదునగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. పిల్లలు కావ్య (15), ధనలక్ష్మి (16), అశ్విన్ (10)లతో పాటూ లక్ష్మి (38) అనే మహిళ స్థానిక ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.


