నేడు పెరంబూరుకు సీఎం విజయ్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు పెరంబూరుకు సీఎం విజయ్‌

Jul 13 2026 12:04 AM | Updated on Jul 13 2026 12:04 AM

● రూపుదిద్దుకున్న ఎమ్మెల్యే కార్యాలయం ● సంక్షేమ పథకాల పంపిణీ నిర్ణయం ● ప్రజా వేదిక యాప్‌ సిద్ధం

సాక్షి చైన్నె : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ తాను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పెరంబూర్‌ ని యోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేసిన తన శాసనసభ్యుని కార్యాలయా న్ని సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం విజయ్‌ తిరుచ్చి ఈస్ట్‌, పెరంబూర్‌ అనే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత తిరుచ్చి ఈస్ట్‌ స్థానానికి రాజీనామా చేసి, పెరంబూర్‌ ఎ మ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా చైన్నె వ్యా సర్పాడి, శర్మ నగర్‌, 1వ వీధిలో ఆధునిక ఎమ్మె ల్యే కార్యాలయం ప్రజలతో మమేకమయ్యే విధంగా రూపు దిద్దుకుంది ముఖ్యమంత్రి కోసం ప్రత్యేక గదిని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు 10 మంది సిబ్బందితో కూడిన కంప్యూటర్‌ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.

లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు

కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం, సమీపంలోని రేషన్‌ షాపును సీఎం విజయ్‌ తనిఖీ చేయనున్నారు. అలాగే నియోజకవర్గ ప్రజలకు కొత్త రేషన్‌ కార్డులు, భూమి పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఇక నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను (విద్యుత్‌, రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, అత్యవసర సాయం మొదలైనవి) నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా సోమవారం ఒక ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ యాప్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులపై 3 రోజుల్లోగా ప్రాథమిక చర్యలు తీసుకుంటారు. తాగునీరు, విద్యుత్‌ వంటి అత్యవసర సమస్యలకు గరిష్టంగా 10 రోజుల్లోగా పూర్తి పరిష్కారం చూపిస్తారు. దీని పర్యవేక్షణ కోసం కార్యాలయంలో ఒక ఆధునిక కంట్రోల్‌ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి విజయ్‌ మొదటిసారి తన సొంత నియోజకవర్గానికి వస్తుండటంతో, తమిళగ వెట్రి కళగం పార్టీ శ్రేణులు, ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నా రు. భద్రత కోసం భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement