శోకసంద్రంలో.. వియత్నాం బాధిత కుటుంబాలు | - | Sakshi
Sakshi News home page

శోకసంద్రంలో.. వియత్నాం బాధిత కుటుంబాలు

Jul 13 2026 12:04 AM | Updated on Jul 13 2026 12:04 AM

● అళగురాజన్‌ (తిరుచ్చి): మొబైల్‌ కంపెనీ జోనల్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌. ఈయనకు భార్య శరవణప్రియ (పాఠశాల ఉపాధ్యాయురాలు), ఇద్దరు కుమారులు ఉన్నారు. ● బాలాజీ (40, తిరుచ్చి): మొబైల్‌ ఫోన్‌ హోల్‌సేల్‌ కంపెనీ మేనేజర్‌. ఈయనకు భార్య విష్ణుప్రియ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ● షేక్‌ అబ్దుల్లా (41, తిరుచ్చి): మొబైల్‌ సేల్స్‌ డిస్ట్రిబ్యూటర్‌ మరియు హార్డ్‌వేర్‌ వ్యాపార భాగస్వామి. ఈయనకు భార్య నశీమాబాను, ఒక కుమారుడు (సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌), వివాహమైన కుమార్తె ఉన్నారు. శ్రీధర్‌ (62, సేలం): ప్రైవేట్‌ సెల్‌ ఫోన్‌ కంపెనీ డీలర్‌, వ్యాపారవేత్త. ఈయనకు భార్య జయంతి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సెంథిల్‌కుమార్‌ (45, ధర్మపురి): ప్రైవేట్‌ మొబైల్‌ కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌. ఈయనకు భార్య పూవిళి, 4వ తరగతి చదువుతున్న కుమార్తె లోకశ్రీ ఉన్నారు. రవిశంకర్‌ (51, తిరువణ్ణామలై): ప్రముఖ మొబైల్‌ ఫోన్‌ డీలర్‌. ఈయనకు భార్య గాయత్రి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

– తమిళనాడుకు చెందిన ప్రముఖ మొబైల్‌ డీలర్లు దుర్మరణం

సాక్షి, చైన్నె: విహారయాత్ర కోసం వియత్నాం వెళ్లిన తమిళనాడుకు చెందిన మొబైల్‌ ఫోన్‌ వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు పడవ బోల్తా పడిన ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. ఒకే మొబైల్‌ కంపెనీకి చెందిన డీలర్లు, మేనేజర్లు అందరూ కలిసి జూలై 8వ తేదీ రాత్రి వియత్నాం పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో తిరుచ్చి, సేలం, ధర్మపురి, తిరువణ్ణామలై జిల్లాలకు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది.

ఉదయం పుట్టినరోజు శుభాకాంక్షలు..

సాయంత్రానికి నివాళులు

ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ధర్మపురి జిల్లాకు చెందిన మొబైల్‌ డిస్ట్రిబ్యూటర్‌ సెంథిల్‌కుమార్‌ (45) ఒకరు. శనివారం ఆయన పుట్టినరోజు కావడంతో ఉదయం బంధువులు, స్నేహితులు వాట్సాప్‌, ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంతోషం పంచుకున్నారు. అయితే, సాయంత్రానికే ఆయన పడవ ప్రమాదంలో మరణించారనే వార్త రావడంతో స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉదయం శుభాకాంక్షలు తెలిపిన వారే, సాయంత్రం నివాళులు అర్పించాల్సి రావడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

మృతుల వివరాలు

మొబైల్‌ కంపెనీ పర్యటనలో భాగంగా వెళ్ళి ప్రమాదానికి గురైన మృతుల వివరాలు ఇలా ఉన్నాయి:

కుటుంబ సభ్యుల ఆవేదన

మృతుడు షేక్‌ అబ్దుల్లా ప్రమాదానికి కొన్ని గంటల ముందే తన మనవరాలితో వీడియో కాల్‌ మాట్లాడారని, జూలై 13 ఉదయం తిరుచ్చి వస్తానని చెప్పారని ఆయన సోదరుడు మహమ్మద్‌ బావా కన్నీరుమున్నీరయ్యారు. కాగా ప్రస్తుతం మతదేహాలను వియత్నాం రాజధాని పరిసర ప్రాంతాల నుండి భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమ వారి మృతదేహాలను వీలైనంత త్వరగా స్వగ్రామాలకు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీళ్లతో అభ్యర్థిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement