ఘనంగా విశిష్ట రైల్‌ సేవా పురస్కార్‌ ప్రదానం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా విశిష్ట రైల్‌ సేవా పురస్కార్‌ ప్రదానం

Jun 12 2026 6:03 AM | Updated on Jun 12 2026 6:03 AM

సాక్షి, చైన్నె: భారతీయ రైల్వే 71వ రైల్వే వారోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం దక్షిణ రైల్వేలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని సత్కరించేందుకు ఉద్దేశించిన విశిష్ట రైల్‌ సేవా పురస్కార్‌ 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. చైన్నె ఐసీఎఫ్‌లోని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఆడిటోరియంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి దక్షిణ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.ఎన్‌. సింగ్‌ హాజరై అవార్డులను అందజేశారు. దక్షిణ రైల్వే జోన్‌ పరిధిలోని డివిజన్లలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఇచ్చే అత్యున్నత జీఎమ్‌ ఇంటర్‌–డివిజనల్‌ ఓవరాల్‌ ఎఫిషియన్సీ షీల్డ్‌ను ఈసారి రెండు డివిజన్లు ఉమ్మడిగా గెలుచుకున్నాయి. మొత్తం 101 మంది ఉద్యోగులు, అధికారులకు వ్యక్తిగత అవార్డులను ప్రదానం చేశారు. వీటితో పాటూ వివిధ విభాగాలలో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు 38 ఎఫిషియన్సీ ఫీల్స్‌డ్స్‌ అవార్డులు, రైల్వే సిబ్బంది పిల్లలకు స్టూడెంట్‌ మెరిట్‌ సర్టిఫికెట్లను జీఎం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement