ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని రక్షించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని రక్షించిన పోలీసులు

Jun 12 2026 6:03 AM | Updated on Jun 12 2026 6:03 AM

వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి రైల్యే సిబ్బంది గురువారం వేకువ జామున 2.40 గంటల సమయంలో సిబ్బంది ట్రాక్‌ నిర్వహణ పనులు ముగించుకొని కాట్పాడి రైల్వే స్టేషన్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ సమయంలో కాట్పాడి– లత్తేరి మధ్య పట్టాలపై ఒక వ్యక్తి తన తలను పెట్టుకొని ఉండడాన్ని రైల్వే పోలీసులు గమనించారు. వీటిని గమనించిన రైల్యే పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో చైన్నె నుంచి జోలార్‌పేట మీదుగా వస్తున్న ధనబాద్‌ –ఆలపుయ ఎక్స్‌ప్రెస్‌ రైలు వస్తున్న విషయాన్ని గమనించి వెంటనే కాట్పాడి రైల్యే అధికారులకు సమాచారం అందజేసి రైలును నిలిపి వేయాలని తెలిపారు. అప్పటికే రైల్వే అధికారులు రైలు ఇంజిన్‌ డ్రైవర్‌కు సమాచారం చేరవేసి రైలును మధ్యలోనే నిలిపి వేశారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైలు పట్టాలపై పడుకొని ఉన్న కార్మికుడిని అదుపులోకి తీసుకొని రైల్యే స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ జరిపారు. ఇతను వేలూరుకు చెందిన రామచంద్రన్‌గా తెలియ వచ్చింది. తర్వాత అతన్ని వేలూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. రైల్యే సిబ్బంది అర్థరాత్రి సమయంలో పట్టాలు సరి చేస్తుండగా ఒక కార్మికుడు ప్రాణాలు కాపాడిన సంఘటన సంచలనం రేపింది.

Advertisement
 
Advertisement
Advertisement