ప్రమాదకర ప్రయాణం
తిరుత్తణి: ఏమాత్రం చిన్నపాటి నిర్లక్ష్యం చూపినా ప్రమాదం తప్పదని తెలిసి కూడా చిరు వ్యాపారులు, విద్యార్ధులు సహా ప్రయాణికులు రైలు ట్రాక్‌పై నడిచి వెళ్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. వివరాలు.. ఆధ్యాత్మిక పట్టణం తిరుత్తణికి పలు ప్రాంతాల నుంచి రోజూ వేలాది మంది రైలు, బస్సుల ద్వారా వస్తుంటారు. అలాగే తిరుత్తణి పరిసర ప్రాంతాలకు చెందిన యువత, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్ధులు, సహా అనేక మంది చైన్నె, తిరువళ్లూరు. అరక్కోణం , తిరుపతి ప్రాంతాలకు రైలు ద్వారా ప్రయాణం చేస్తుంటారు. ఉదయం సాయంత్రం సమయాల్లో రైల్వే స్టేషన్‌లో రద్దీ నెలకొంటుంది. రైలులో సీట్లు కోసం విద్యార్థులు, వ్యాపారులు అత్యవసరంగా ట్రాకుకు మధ్యలో నడుచుకుంటూ వెళ్లి రైలు ఎక్కి ప్రయాణం చేస్తుంటారు. దీంతో తరుచూ రైలు ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రయాణికుల కోసం రైల్వేశాఖ వెంతెనలు నిర్మించినా చాలా మంది ప్రయాణికులు మాత్రం ట్రాకులో మధ్యలో నడుచుకుంటూ వెళ్లి రైలులో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా ట్రాకులో నడిచుకుంటూ వెళ్లి ప్రయాణం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులకు రక్షణ కల్పించేందకు రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని రైలు ప్రయాణికుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు.


