బాస్కెట్‌బాల్ విజేత శిగా జట్టు
తిరువళ్లూరు: ఆర్‌ఎంకే విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్‌ఎంకే బాస్కెట్ బాల్ పోటీల్లో శిగా పాలిటెక్నిక్ కాలేజ్ విజేతగా నిలిచి కప్‌ను సొంతం చేసుకుంది. తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్‌ఎంకే విద్యాసంస్థ, శ్రీదుర్గాదేవి పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో అంతర పాలిటెక్నిక్ కళాశాల బాస్కెట్ బాల్ పోటీలను నిర్వహించారు. పోటీలకు 40 పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. పోటీలు రెండు రోజుల పాటు జరిగిన క్రమంలో విజేతలకు బహుమతులు అందజేసే కార్యక్రమం ఆర్‌ఎస్ విద్యాసంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్‌ఎస్ మునిరత్నం అధ్యక్షతన నిర్వహించారు. విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు ఆర్‌ఎం కిసోర్ ప్రారంభోపన్యాసం చేశారు. డైరెక్టర్ జ్యోతినాయుడు స్వాగతం పలికారు. విశిష్ట అతిథిగా చైన్నె ఎస్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ రామదాస్, చైన్నె వెంకటాచలపతి సంస్థ డైరెక్టర్ సంపత్ హాజరయ్యారు. ఆర్‌ఎంకే విద్యాసంస్థల అధ్యక్షుడు ఆర్‌ఎస్ మునిరత్నం బహుమతులను అందజేశారు. పోటీల్లో మొదటి స్థానంలో శిగా పాలిటెక్నిక్ కళాశాల, రెండవ స్థానంలో మేల్‌మరువత్తూరు ఆదిపరాశక్తి పాలిటెక్నిక్ కళాశాల, మూడవ స్థానంలో దుర్గాదేవి పాలిటెక్నిక్ కళాశాల, నాల్గవ స్థానంలో సాయిరాం కళాశాలకు చెందిన జట్టు నిలిచి బహుమతులను అందుకున్నాయి. విజేతలకు కప్, సర్టిపికెట్, నగదు బహుమతిని అందజేశారు. ప్రిన్సిపల్ లక్ష్మణ్, హెచ్‌ఓడీ రామకృష్ణన్ శ్రీనివాసన్ పాల్గొన్నారు.


