దరఖాస్తుదారులందరికీ పథకాలు | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుదారులందరికీ పథకాలు

Feb 5 2026 7:48 AM | Updated on Feb 5 2026 7:48 AM

దరఖాస్తుదారులందరికీ పథకాలు

దరఖాస్తుదారులందరికీ పథకాలు

వేలూరు: మీతో స్టాలిన్‌ పథకంలో దరకాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు కలెక్టర్‌ సుబ్బలక్ష్మి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 2025 జూన్‌ మాసంలో మీతో స్టాలిన్‌ పథకాన్ని ప్రారంభించి అన్ని వార్డుల వారిగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వీటిలో మొత్తం 14 శాఖలకు చెందిన అధికారులకు హాజరై ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వీటిలో లబ్ధిదారులను ఎంపిక చేసి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు పంపిణీ కార్యక్రమం బుధవారం ఉదయం విల్లుపురంలో సీఎం స్టాలిన్‌ పథకాన్ని ప్రారంభించారు. దీంతో వేలూరు జిల్లా సత్‌వచ్చారిలోని ప్రయివేటు కల్యాణ మండపంలో కలెక్టర్‌ సుబ్బలక్ష్మి అధ్యక్షతన ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా 896 మందిని ఎంపిక చేసి సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి కూడా విడతల వారిగా అందజేస్తామన్నారు. అనంతరం సంక్షేమ పథకాలను అందజేశారు. ఎమ్మెల్యే అములు, మేయర్‌ సుజాత, సాంఘికసంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి మారన్‌, యూనియన్‌ చైర్మన్‌లు అముద, సచ్చిదానందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement