పోస్టల్ సిబ్బంది మోసం
– ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు
వేలూరు: పోస్టల్ కార్యాలయంలో మహిళా ఉద్యోగిని రూ.3.56 లక్షలు మోసం చేసినట్లు ఒక దివ్యాంగురాలు వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఎస్పీ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ సెల్ ఎస్పీ మయిల్‌వాగణన్ అధ్యక్షతన డీఎస్పీ చిన్నరాజ్ వినతులను స్వీకరించారు. వినతులను స్వీకరించిన డీఎస్పీ ఆయా పోలీస్ స్టేషన్‌లకు పంపి వెంటనే విచారణ జరిపి నివేదిక పంపాలని ఆదేశించారు. ఇందులో పేర్నంబట్టు తాలుకాకు చెందిన రైతు నాయకులు అందజేసిన వినతిలో పేర్కొన్న విధంగా పేర్నంబట్టు తాలుకా కుండలపల్లి చెరువు, అత్తికుప్పం,శివనగురిపల్లి, గుండ్లపల్లి వంటి ప్రాంతాల్లోని వాగు నుంచి ట్రాక్టర్‌లు, బైకుల ద్వారా తరచూ ఇసును తరలిస్తున్నారని వీటిపై నిలదీస్తే తమపై దాడులకు దిగుతున్నారని అన్నారు.వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. తరచూ ఇసును తీయడం ద్వారా నీటి మట్టం తగ్గి పోయి వ్యవసాయ సాగుకు అవసరమైన నీటి సరఫరా చాలడం లేదని వీటిపై విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు. అదే విధంగా కాట్పాడి సమీపంలోని జాబ్రాపేటకు చెందిన ఒక దివ్యాంగురాలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా తాను గత 2015వ సంవత్సరం నుంచి తాను పోస్టల్ కార్యాలయంలో తరచూ సేవింగ్స్‌లో రూ.3.56 లక్షలు చెల్లించానని అయితే ప్రస్తుతం వాటిని తీసుకునేందుకు వెళ్లిన సమయంలో తనకు అక్కడ సిబ్బందిగా పనిచేస్తున్న సుడర్ తన వద్ద ఖాతా పుస్తకాన్ని తీసుకొని తిరిగి ఇవ్వలేదని వీటిపై నిలదీస్తే ఎటువంటి చర్యలు తీసుకోలేదని వీటిపై విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు.


