సురక్షితమైన క్యాంపస్ మద్రాస్ ఐఐటీ
కొరుక్కుపేట: ఐఐటీ మద్రాస్ సంతోషకరమైన, సురక్షితమైన క్యాంపస్ అని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి అన్నారు. ఐఐటీ మద్రాస్ శ్రీటువార్డ్స్ ఏ హ్యాపీ, సేఫ్ అండ్ సెక్యూర్ క్యాంపస్‌శ్రీ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది విద్యార్థుల శ్రేయస్సు, భద్రత , సహాయక క్యాంపస్ వాతావరణం పట్ల దాని నిరంతర నిబద్ధతను తెలుపుతూ ఈ కార్యక్రమం సాగింది.కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్‌లోని స్టూడెంట్ అంబుడ్స్ ,రిటైర్డ్ ఐపీఎస్ జి. తిలగవతి, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి ప్రసంగించారు. బాధ్యత, నమ్మకం ఆధారిత వ్యవస్థలు, సానుకూల విద్యార్థి అనుభవాన్ని వివరిస్తూ ఐఐటి మద్రాసు ప్రాముఖ్యతను తెలియజేశారు. తిలగవతి మాట్లాడుతూ ఉపాధి కోరుకునే బదులు, మీరు యజమానులుగా ఉండాలని, మీరు స్వంత సంస్థలను ప్రారంభించి వ్యవస్థాపకులుగా మారాలని ఆయన విద్యార్థులకు సూచించారు.


