చాంపియన్ ఆఫ్ హ్యూమానిటీ అవార్డుల ప్రదానం
కొరుక్కుపేట: హిందూస్తాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (హెచ్‌సీసీ) 80వ చాంబర్ దినోత్సవం సందర్భంగా వ్యాపార శ్రేష్ఠతకు, సమాజానికి విశేష కృషిచేసినందుకు పలువురికి చాంపియన్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డులు ప్రదానం చేశారు. హెచ్‌సీసీ అధ్యక్షుడు టి. రమేష్ దుగర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి టి. మనో తంగరాజ్, ఎం ఆసియా ఇంజినీరింగ్ చైర్మన్ సహ వ్యవస్థాపకులు మహీందర్ కె జైన్,రామరాజ్ కాటన్ వ్యవస్థాపక చైర్మన్ కేఆర్ నాగరాజన్ హాజరయ్యారు. రామరాజ్‌కాటన్‌న్‌ను వారి వ్యాపార నైపుణ్యానికి, అమర్ సేవా సంఘ సమాజ సేవకు చాంపియన్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు ప్రకటించారు. రామరాజ్‌కాటన్ తరఫున ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ నాగరాజన్ ఈ అవార్డును స్వీకరించారు. అమర్ సేవా సంఘం తరఫున దాని వ్యవస్థాపక చైర్మన్ ఎస్. రామకృష్ణన్, సహ వ్యవస్థాపక కార్యదర్శి శంకరరామన్ అవార్డును అందుకున్నారు.


