వైభవంగా తీర్థవారి
–పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు
తిరువళ్లూరు: ప్రసిద్ధి చెందిన శ్రీ వైద్య వీరరాఘవుడి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం తీర్ధవారి నిర్వహించారు. తిరువళ్లూరులో వైద్య వీరరాఘవుడి ఆలయంలో ప్రతి ఏటా తైమాసం బ్రహ్మోత్సవాలను పది రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఉత్సవాలు గత 15న ధ్వజారోహణంతో ఉత్సవాలను ప్రారంభించారు. ప్రతిరోజూ స్వామి వారు వాహనంపై భక్తులకు దర్శనమివ్వడంతో పాటు మాడ వీధుల్లో ఊరేగించారు. ఉత్సవాల్లో తొమ్మిదవ రోజైన శుక్రవారం ఉదయం తీర్థఽవారి నిర్వహించారు. అనంతరం తిరుమంజనం నిర్వహించిన ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామి వారు శ్రీదేవి భూదేవిలతో కలిసి దర్శనమిచ్చారు. రాత్రి విజయకోటి విమాన వాహనసేవను వైభవంగా నిర్వహించారు.


