వేపంబట్టు బ్రిడ్జి ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వేపంబట్టు బ్రిడ్జి ప్రారంభం

Jan 24 2026 7:51 AM | Updated on Jan 24 2026 7:51 AM

వేపంబట్టు బ్రిడ్జి ప్రారంభం

వేపంబట్టు బ్రిడ్జి ప్రారంభం

తిరువళ్లూరు: తిరువళ్లూరులో సమీపంలో నూతనంగా రూ.44.55కోట్లతో నిర్మించిన వేపంబట్టు బ్రిడ్జిని రాష్ట్ర రహదారుల శాఖమంత్రి వేలు ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు వద్ద బ్రిడ్జి నిర్మాణానాకి 15 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నర కాలంలో పనులు పూర్తి చేయాల్సి క్రమంలో కొందరు బాధితులు కోర్టును ఆశ్రయించడంతో పనులు ఆగిపోయాయి. ఇటీవల కోర్టు బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో గత ఏడాది పనులను పునఃప్రారంబించారు. పనులు పూర్తయిన క్రమంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర మంత్రి వేలు ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. మంత్రి మాట్లాడుతూ 2009వ సంంవత్సరంలో 29.5 కోట్ల వ్యయంతో బ్రిడ్జి ప్రారంబించినట్టు తెలిపారు. అయితే కోర్టు కేసు కారణంగా నిర్మాణం ఆలస్యమైనట్టు తెలిపారు. అయితే కోర్టు కేసుల కారణంగా రూ.24.18 కోట్లు నిధులు అదనంగా అవసరం ఏర్పడిందన్న ఆయన, ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణంతో 20 గ్రామాలకు చెందిన ప్రజల రాకపోకలకు సౌకర్యంగా మారిందన్నారు. పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి, తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌, కలెక్టర్‌ ప్రతాప్‌పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement