రిపబ్లిక్ డే రిహార్సల్స్
సాక్షి, చైన్నె: మళ్లీ మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో చైన్నెలో ఉన్నవాళ్లు వారి స్వస్థలాలకు శుక్రవారం బయల్దేరారు. దీంతో ప్రత్యేక బస్సులు అనేక మార్గాలలో నడపాల్సి వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా సుమారు ఐదారు రోజులు సెలవులు రావడంతో చైన్నె నుంచి సుమారు పది లక్షల మందికిపైగా స్వస్థలాకు వెళ్లారు. తాజాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మళ్లీ వరుస సెలవులు రావడం అనేక మందికి కలిసి వచ్చినట్టైంది. శని, ఆది, సోమవారాలు సెలవులు రావడంతో చైన్నె నుంచి స్వస్థలాలకు వెళ్లి తమ కుటుంబాలతో గడిపేందుకు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లు ఉరకలు తీశారు. దీంతో చైన్నె నుంచి పలు మార్గాలలో అదనంగా 2 వేల ప్రత్యేక బస్సులను రోడ్డెక్కిస్తూ రవాణా సంస్థ చర్యలు తీసుకుంది. ఇక రిపబ్లిక్ డే వేడుకల కసరత్తులో భాగంగా కామరాజర్ సాలైలో చివరి విడతగా త్రివర్ణ దళాలు, ఎన్‌సీసీ కేడర్లు, పోలీసు శాఖ, వివిధ కళాశాలల విద్యార్థుల రిహార్సల్స్ ప్రదర్శన అదరహో అనిపించే విధంగా జరిగాయి. ఈ సారి వేడుకలలో పలు రాష్ట్రాల సంస్కృతులను చాటే విధంగా ప్రత్యేక ప్రదర్శనలు అనుమతి ఇవ్వడంతో ఆయా రాష్ట్రాల విద్యార్థులు రిహార్సల్స్‌కు తరలివచ్చారు. ఈ రిహార్సల్స్ కారణంగా కామరాజర్ సాలైలో ఓ వైపు మార్గాన్ని మూసి వేశారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు రోడ్డుకు ఇరువైపులా వాహనదారులు బారులు తీరారు. శని, ఆదివారాలలో ఈ మార్గంలో గణతంత్ర వేడుకల నిమ్తితం ప్రత్యేక ఏర్పాట్లు విస్తృతం కానున్నాయి.
రిపబ్లిక్ డే రిహార్సల్స్
రిపబ్లిక్ డే రిహార్సల్స్


