అడ్వాన్స్‌డ్ ట్రామాకేర్ ప్రారంభం
న్యూస్‌రీల్
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వం అమలు చే స్తున్న నమ్మై కాక్కుమ్ 48 వైద్య సేవలలో భాగంగా అత్యవసర చికిత్సల కోసం ఆశ్రయించే వారి కోసం ఎస్‌ఆర్‌ఎంలో అడ్వాన్స్‌డ్ ట్రామా అండ్ ఎమర్జన్సీ వార్డును అత్యాధునిక సేవలతో ఏర్పాటు చేశారు. దీనిని ఎమ్మెల్యే వరలక్ష్మి ప్రారంభించారు. అలాగే నమ్మైకాక్కుం 48 పథకం 5,00,000వ లబ్ధిదారుడిని సత్కరించారు. అత్యవసర ట్రామా కేర్ ఫ్రేమ్ వర్క్‌కు మద్దతుగా ఇవ్వడం, మొదటి 48 గంటలలో ప్రాణాంతక పరిస్థితులతో వచ్చే వారికి వైద్య సేవలు అందించడం లక్ష్యంగా ఈ సెంటర్‌లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఎం ఆస్పత్రి అదనపు రిజిస్ట్రార్ డాక్టర్ టి.మైథిలి, ప్రో వైస్ చాన్సలర్ నితిన్ నాగర్కర్, సలహాదారుడు, డీన్ డాక్టర్ వి.పి.చంద్రశేఖరన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరామన్ తదితరులు పాల్గొన్నారు.
జల్లికట్టుకు మరింత సడలింపు
సాక్షి, చైన్నె : జల్లికట్టుకు మరింత సడలింపు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళుల సంప్రదాయ, సాహస క్రీడ జల్లికట్టు గురించి తెలిసిందే. జంతు ప్రేమికుల రూపంలో ఎదురైన సమస్యతో నిషేధం విధించిన ఈ క్రీడను మహోద్యమం ద్వారా తమిళులు మళ్లీ సాధించుకున్నారు. అప్పటి నుంచి అనేక కట్టుబాట్లు, ఆంక్షల నడుమ జల్లికట్టు నిర్వహణ జరుగుతుంది. ఈ పరిస్థితులలో మరింత సడలింపు నిబంధనలలో ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సంక్రాంతి రోజైన అవనీయాపురంలో, కనుమ రోజున పాలమేడులో, కానుం పొంగల్ రోజున అలంగానల్లూరులో జరిగిన జల్లికట్టు గురించి ప్రస్తావించారు. కార్యక్రమానికి హాజరైన సీఎం స్టాలిన్ తన ప్రసంగంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు, జల్లికట్టు ఎద్దుల కోసం మెరుగైన వైద్య చికిత్స కేంద్రం నిర్మాణం గురించి, క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాల కల్పనను గుర్తు చేశారు. తాజాగా ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడానికి చర్యలు తీసుకుందన్నారు. ఆమేరకు స్థానిక ఎద్దులు, క్రీడాకారులు పాల్గొనేందుకు మార్గం సుగమం చేస్తూ, ఆన్‌న్‌లైన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను మార్చారు. జిల్లా కలెక్టరేట్ ద్వారా ఈప్రక్రియ చేపట్టనున్నారు. అలాగే, పోటీల సమయంలో మరణించే క్రీడాకారులకు జీవిత బీమా తప్పనిసరి అన్న నిబంధనను సడలించారు. ఇప్పటివరకు జల్లికట్టు పోటీల నిర్వాహకులు స్టాంప్ పేపర్‌పై ప్రమాణ పత్రం సమర్పించే విధానాన్ని రద్దు చేశారు. జల్లికట్టు తమిళనాడు వారసత్వాన్ని కాపాడడానికి సహకారం అందించేందుకు, ఈ క్రీడలను ప్రోత్సహించడం, కొనసాగించడం లక్ష్యంగా ముందుకెళ్లనున్నామని ప్రకటించారు.
శ్రీపెరంబదూరులో
రూ.150 కోట్ల ఏరో స్పేస్
సాక్షి, చైన్నె: శ్రీపెరంబదూరు పారిశ్రామిక వాడలో ట్రస్టెడ్ ఏరో స్పేస్ ఇంజినీరింగ్ (టీఏఎస్‌ఈ గ్లోబల్) సంస్థ తన కొత్త అత్యాధునిక తయారీ కేంద్రాన్ని నెలకొల్పింది. రూ.150 కోట్లతో ఏరో స్ట్రక్చర్ భాగాలపై దృష్టి పెట్టారు. రానున్న మూడు సంవత్సరాలలో రూ.300 కోట్ల రాబడి దిశగా ముందుకెళ్లనున్నారు. జపాన్‌లోని డీఎంజీ మోరి అధ్యక్షుడు డాక్టర్ ఇంజినీర్ ముసాహికోమోరి ఈ పరిశ్రమను ప్రారంభించారు.
అడ్వాన్స్‌డ్ ట్రామాకేర్ ప్రారంభం


