మద్రాసు వర్సిటీ నుంచి పీహెచ్‌డీ | - | Sakshi
Sakshi News home page

మద్రాసు వర్సిటీ నుంచి పీహెచ్‌డీ

Jan 24 2026 7:48 AM | Updated on Jan 24 2026 7:48 AM

మద్రాసు వర్సిటీ నుంచి పీహెచ్‌డీ

మద్రాసు వర్సిటీ నుంచి పీహెచ్‌డీ

కొరుక్కుపేట: మద్రాసు వర్సిటీ తెలుగు శాఖ పరిశోధక విద్యార్థిని ఎస్‌. శశికళ మద్రాస్‌లోని తెలుగు రచయిత్రుల ఆధునిక సాహిత్యం పరీశీలన (2000–2020) అనే అంశంపై సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి శుక్రవారం మౌఖిక పరీక్ష నిర్వహించి పీహెచ్‌డీ ప్రకటించారు. ఈ సిద్ధాంత వ్యాసానికి పర్యవేక్షకులుగా ఆచార్య విస్తాలి శంకరరావు ఉండగా, మౌఖిక పరీక్ష నిర్వహణకు మద్రాసు క్రైస్తవ కళాశాల, తెలుగుశాఖ అధ్యక్షుడు డా.శ్రీపురం జయశేఖర్‌ నిర్వహించారు. ఆచార్య విస్తాలి శంకరరావు పరిశోధనాంశాన్ని పరిచయం చేశారు. తర్వాత ఎస్‌.శశికళ తన పరిశోధనాంశాన్ని సంక్షిప్తంగా నభకు పరిచయం చేశారు. చివరగా వారు పీహెచ్‌డీ సిద్ధాంత వ్యాసానికి డాక్టరేట్‌ పట్టాను అందించవలసిందిగా వర్సిటీ అధికారులకు తెలియజేశారు. డా.ఎల్‌బీ శంకరరావు దంపతులు, డా. కాసల నాగభూషణం, డా.కె.వెంకటకృష్ణశాస్త్రి, డా.ఎం. మురళి, తమ్మినేని బాబు, గుడిమెట్ల చెన్నయ్య, రచయిత్రులు జ్యోషులు ఉమ, డా. తిరుమల ఆముక్తమాల్యద, కొవ్విడి రమాదేవి, అరుణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement