ఘనంగా ఆలయ మహాకుంభాభిషేకం
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి గాంధీనగర్‌లోని ప్రభుత్వ సహకార శిక్షణ కేంద్రంలో కొత్తగా నిర్మించిన వాలంపురి వినాయకుడి ఆలయ మహాకుంభాభిషేకం శుక్రవారం ఉదయం ఘనంగా జరిగింది. తమిళనాడు సహకార సంఘం అదనపు రిజిస్ట్రార్, ఎండీ రవిచంద్రన్ సలహా మేరకు వేలూరు జోనల్ డైరెక్టర్ ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో నూతనంగా వినాయకుడి ఆలయాన్ని నిర్మించారు. ఇందులో వేద మండితులు ప్రత్యేక యాగశాల, కలశ, గోపూజ, గజ పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో ఉంచిన కలశ నీటిని శివాచార్యుల వేద మంత్రాల నడుమ ఆలయ రాజగోపురంపైకి తీసుకెళ్లి మహాకుంభాభిషేకం చేసి కలశ నీటిని భక్తులపై చల్లారు. అనంతరం అన్నదానం చేశారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు జాయింట్ రిజిస్ట్రార్ రామదాస్, వేలూరు సహకార శాఖ జాయింట్ రిజిస్ట్రార్ పళనిస్వామి, సహకార శాఖ రిజిస్ట్రార్ వేల్‌మురుగన్, విక్రయ జాయింట్ రిజిస్ట్రార్ ప్రభు, గుడియాత్తం సిటీ బ్యాంకు జాయింట్ రిజిస్ట్రార్ లక్ష్మణ్, హౌసింగ్ కో–ఆపరేటివ్ అసోసియేషన్ జాయింట్ రిజిస్ట్రార్ అన్బరసి, శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ ఏలుమలై, సహకార బ్యాంకు సిబ్బంది, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా ఆలయ మహాకుంభాభిషేకం


