సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ 13వ చిత్రం | - | Sakshi
Sakshi News home page

సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ 13వ చిత్రం

Jan 24 2026 7:48 AM | Updated on Jan 24 2026 7:48 AM

సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ 13వ చిత్రం

సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ 13వ చిత్రం

తమిళసినిమా: ఇంతకుముందు పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను నిర్మించిన సంస్థ సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌. ఇటీవల ఈ సంస్థ నిర్మాత ఎస్‌ఎస్‌.లలిత్‌కుమార్‌ నిర్మించిన చిత్రం సిరై అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా ఇద్దరు హీరోలతో ఒకరిగా పరిచయమైన అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న రెండవ చిత్రం ఇది. జాఫర్‌ సాధిక్‌, నోబల్‌ కే.జేమ్స్‌, అరుణాచలేశ్వరన్‌ .పీఏ, షారిక్‌ హాసన్‌, డ్యూడ్‌ చిత్రం పేమ్‌ ఐశ్వర్యశర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌ఎస్‌.లలిత్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా విఘ్నేశ్‌ వడివేల్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లియోన్‌ బ్రిటో చాయాగ్రహణం, జన్‌ మార్టిన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని యూనిట్‌ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకాన్ని నిర్మాత వ్యక్తం చేశారు. ఏకే.విష్ణుకుమార్‌ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నట్లు, చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. కాగా ఇంకా టైటిల్‌ను నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement