ధనుష్ @55
తమిళసినిమా: పాన్ వరల్డ్ కథానాయకుడిగా వెలిగిపోతున్న నటుడు ధనుష్. ఈయన ఇటీవల కథానాయకుడిగా నటించిన కుబేర, ఇడ్లీకడై, హిందీ చిత్రం తేరేఇష్క్‌మే చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు. దీనికి కర అనే టైటిల్‌ను ఖారారు చేశారు. ఐసరిగణేశ్ తమ వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. తాజాగా ధనుష్ తన కొత్త చిత్రానికి సిద్ధమైపోయారు.
ఇంతకుముందు అమరన్ వంటి సంచలన విజయాన్ని సాదించిన చిత్రం ధర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంతకుముందు గోపురం ఫిలింస్ సంస్థ నిర్మించడానికి సన్నాహలు చేసింది. అయితే కారణాలు ఏమైనా ఈ చిత్రం నుంచి ఆ సంస్థ వైదొలగింది. దీంతో ఈ చిత్రాన్ని ఇప్పుడు ధనుష్ నిర్మించడానికి ముందుకొచ్చారు. తన వండర్‌బార్ ఫిలింస్ సంస్థ ఆర్‌టెక్స్ స్డూడియోస్ సంస్థతో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ధనుష్ 55వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఇది భారీ బడ్జెట్‌లో రూపొందనున్నట్లు సమాచారం.


