● స్టార్ 3.ఓతో 18 సేవలు ● శ్రీకారం చుట్టిన సీఎం స్టాలి
సాక్షి, చైన్నె: రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచి ఇక ఆ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం అమల్లోకి తీసుకొచ్చింది. స్టార్ 3.ఓ పేరిట 18 రకాల సేవలను రిజిస్ట్రేషన్ల శాఖలో గురువారం ఆవిష్కరించారు. ఈ సేవలకు సచివాలయం నుంచి సీఎం స్టాలిన్ శ్రీకారం చుట్టారు. అలాగే, తూత్తుకుడి నిర్లవణీకరణ ప్రాజెక్టు పనులకు పునాది వేశారు. మందవెలిలో మాల్‌తో కూడిన బస్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేశారు. తూత్తుకుడి ప్రగతి పథంలో దూసుకెళుతోంది. విదేశీ సంస్థలు పెట్టుబడులను పెట్టేందుకు తూత్తుకుడి వైపుగా పరుగులు తీస్తున్నాయి. ఇక్కడి కులశేఖరపట్నంలో ఇస్రో లాంచ్ పాడ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే, విమాన శిక్షణ కేంద్రానికి కసరత్తులు వేగవంతం చేశారు. మదురై – తూత్తుకుడి కారిడార్‌కు అపూర్వ స్పందన వస్తుండడంతో తొలి అడుగుగా తూత్తుకుడి జిల్లా ముల్లక్కాడు గ్రామంలో రోజుకు 60 మిలియన్ లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో నీటిని అందించడానికి నిర్లవణీకరణప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రూ.2,292.38 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులకు వీడియో కాన్పరెన్స్ ద్వారా చైన్నె నుంచి సీఎం స్టాలిన్ పునాది వేశారు. మంత్రులు గీతా జీవన్, అనిత ఆర్.రాధాకృష్ణన్, టీఆర్‌బీ రాజా, ఎంపీ కనిమొళి, సీఎస్ మురుగానందం, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరుణ్‌రాయ్ ఎండీ కె సెంథిల్ రాజ్ హాజరయ్యారు.
మంద వెలిలో టెర్మినల్
చైన్నె మెట్రో అసెట్ మేనేజ్‌మెంట్ నేతృత్వంలో మందవెలిలో రూ.167.09 కోట్లతో మాల్‌తో కూడిన బస్ టెర్మినల్‌కు చర్యలు తీసుకున్నారు. ఈ పనులకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. అలాగే, చైన్నె మెట్రో రైల్ కార్పొరేషన్ రూ.60 కోట్లతో కొత్తగా నిర్మించిన నాలుగు లేన్ల రోడ్డుతో కూడిన వంతెన మార్గాన్ని ప్రారంభించారు. మంత్రి శివశంకర్, స్పెషల్ ఇన్సియేటివ్స్ విభాగం ప్రధాన కార్యదర్శి కె గోపాల్, రవాణా శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చున్సోంగం జాతక సిరు, మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎం.ఎ. సిద్ధిక్, మున్సిపల్ ట్రాన్‌న్స్‌పోర్ట్ కార్పొరేషన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ టి.ప్రభు శంకర్ హాజరయ్యారు. పశుసంవర్థక శాఖ నిర్మించిన భవనాలను సీఎం వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే, 118.42 కోట్లతో చేపట్టనున్న కొత్త భవనాల పనులకు శంకుస్థాపన చేశారు. 126 జూనియర్ అసిస్టెంట్ , 96 టైపిస్ట్ పోస్టులకు ఎంపికై న వారికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. మంత్రి అనితా రాధాకృష్ణన్, పశు సంవర్థక శాఖ కార్యదర్శి సుబ్బరాయన్, వెటర్నరీ కేర్ అండ్ మెడిసిన్ విభాగం డైరెక్టర్ ఎస్పీ అమృత్ హాజరయ్యారు. ముందుగా విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించడానికి ఎంపికై న 10 మంది మైనారిటీ విద్యార్థులకు రూ. 3.60 కోట్ల స్కాలర్ షిప్‌లను సీఎం అందజేశారు. అలాగే, 2 పురాతన చర్చ్‌లు పునఃనిర్మాణానికి రూ.1.81 కోట్లను కేటాయిస్తూ చెక్కులను అందజేశారు. మంత్రి నాజర్, ఎమ్మెల్యే ఇనిగో ఇరుదయరాజ్, మైనారిటీ శాఖ కార్యదర్శి శరవణ వేల్‌రాజ్, మైనారిటీ సంక్షేమ కమిషనర్ ఎం.ఆసియా మరియం హాజరయ్యారు.
స్టార్ 3.ఓ ఆవిష్కరణ
రిజిస్ట్రేషన్‌ల శాఖను ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. తాజాగా రిజిస్ట్రీ స్టార్ 3.ఓ సాఫ్ట్‌వేర్‌ను పరిచయం చేశారు. దీనిని సచివాలయంలో సీఎం స్టాలిన్ ఆవిష్కరించారు. దీని ఆధారంగా 18 కొత్త సేవలను ఇంటి నుంచే పొందేందుకు వీలు కల్పించారు. ఆస్తులు కొనుగోలు, అమ్మకాల ప్రక్రియలన్నీ వెబ్ వేదికగా, ఎలక్ట్రానిక్ పత్రంగా సమర్పించే రీతిలో ఆన్‌లైన్ ద్వారా అన్ని రకాల అపార్ట్‌మెంట్, బహుళ అంతస్తుల భవనాలలో ఫ్లాట్‌ల కొనుగోళ్లకు రుసుము చెల్లించే అవకాశం కల్పించారు. వివాహ నమోదు, కాగిత రహిత డాక్యుమెంట్ రికార్డింగ్, ఆటోమేటిక్ బాండ్ రూపకల్పన, పునఃవిక్రయం, ఆస్తి సంబంధిత లావాదేవీలు వంటి 18 రకాల సేవలను ఇంటి నుంచి పొందేందుకు అవకాశం కల్పించారు. మంత్రి పి మూర్తి, సీఎస్ మురుగానందం, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శి శిల్పా ప్రభాకర్ సతీష్, విభాగాధిపతి దినేష్ పొన్‌రాజ్ పాల్గొన్నారు.
● స్టార్ 3.ఓతో 18 సేవలు ● శ్రీకారం చుట్టిన సీఎం స్టాలి
● స్టార్ 3.ఓతో 18 సేవలు ● శ్రీకారం చుట్టిన సీఎం స్టాలి
● స్టార్ 3.ఓతో 18 సేవలు ● శ్రీకారం చుట్టిన సీఎం స్టాలి


