తమన్నాకు పురుషన్‌గా విశాల్
తమిళసినిమా: స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా మకుడం చిత్రాన్ని తెరకెక్కించడంలో బిజీగా ఉన్న నటుడు విశాల్. అదేవిధంగా ఈయన దర్శకత్వం వహించి, నటించనున్న తుప్పరివాలన్–2 చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల దశలో ఉంది. కాగా తాజాగా విశాల్ మరో నూతన చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సుందర్. సి కథా దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ చిత్రాన్ని బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత ఏసీఎస్ అరుణ్‌కుమార్‌తో కలసి నటి కుష్బూ తన అవ్నీ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో తమన్నా నాయకిగా నటిస్తున్నారు. హిప్ హాప్ ఆది సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి పురుషన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను గురువారం విడుదల చేశారు. విశాల్, దర్శకుడు సుందర్.సి కాంబోలో రూపొందుతున్న నాల్గవ చిత్రం ఇది. ఇంతకుముందు ఆంబళ, యాక్షన్, మదగజరాజా చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. అదేవిధంగా విశాల్, తమన్నా కాంబోలో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ఇది. పురుషన్ చిత్ర టీజర్‌లో తమన్నా దర్జాగా కూర్చుని టీవీ చూస్తూ విశాల్‌కు వంట పని అప్పజెబుతుంది. ఆ సమయంలో యోగిబాబు వచ్చి తమన్నాతో ముచ్చట్లు చెబుతుంటాడు. ఆ సమయంలో విశాల్ వంటింట్లో చొరబడ్డ రౌడీలను రప్ఫాడిస్తూనే వంట పని చేస్తారు. ఈ టీజర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పురుషన్ చిత్రాన్ని దర్శకుడు సుందర్.సి తనదైన బాణీలో కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారని యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి.
తమన్నాకు పురుషన్‌గా విశాల్


