ఆలోచింపజేసే లక్ష్మీకాంత్ కొలై వళక్కు
, ప్రగిడ, చిత్ర యూనిట్
ఆలోచింపజేసే
లక్ష్మీకాంత్ కొలై వళ్లక్కు
తమిళసినిమా: ఇంతకుముందు కొండ్రాల్ పావం, మారుతీనగర్ కావల్ నిలయం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన దయాల్ పద్మనాభన్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం లక్ష్మీకాంత్ కొలై వళ్లక్కు. 2 ఎం సినిమాస్ పతాకంపై కె.వి.శబరిస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు దయాల్ పద్మనాభన్ సహ నిర్మాతగా వ్యవరిస్తున్నారు. వెట్రి, రంగరాజన్ పాండే, నటి బ్రిగిడ, లిస్సీ ఆంటోని, శరవణన్, కవిత భారతి, లొల్లు సభ మారన్, ఇళవరసు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ఎస్.వీరపాండియన్ కీలకపాత్రను పోషిస్తున్నారు. దీనికి కథనం, సంభాషణలను కవిత భారతి, దర్శకుడు దయాల్ పద్మనాభన్ కలసి రాశారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల దర్శకుడు వెట్రిమారన్ విడుదల చేసి చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చూసి చాలా బాగున్నాయంటూ ప్రశంసించినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లు దర్శకుడు మీడియా ద్వారా ప్రకటించారు. ఇది ప్రగాఢమైన నమ్మకం నుంచి పుట్టిన కథా చిత్రం అని ఆయన తెలిపారు. చిత్ర యూనిట్ నిజాయితీగా, నమ్మకంతో పని చేశారని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా ప్రేక్షకులను ఆలోచింపజేసే కథా చిత్రంగా ఉంటుందని ఆయన చెప్పారు ఈ చిత్రానికి పన్నీర్‌సెల్వం చాయాగ్రహణం, దర్బూగాశివ సంగీతాన్ని అందిస్తున్నారు.


