బస్టాండ్ నిర్మాణ పనుల పరిశీలన
తిరువళ్లూరు: పట్టణంలో రూ.33 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బస్టాండు నిర్మాణ పనులను కలెక్టర్ ప్రతాప్ అధికారులతో కలసి గురువారం ఉదయం పరిశలించారు. తిరువళ్లూరులో నడిబొడ్డన పాత బస్టాండు వుంది. అయితే బస్టాండు చిన్న ప్రాంతం కావడంతోపాటు రద్దీ సమయంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంటువంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగాలనే ఉద్దేశంతో ఐదెకరాల విస్తీర్ణంతో నూతన బస్టాండు నిర్మాణ పనులను గత సంవత్సరం ప్రారంభించారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్న క్రమంలో ఎన్నికలకు ముందుగానే ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే పనులను కలెక్టర్ ప్రతాప్ గురువారం ఉదయం అధికారులతో కలసి పరిశీలించారు. పనులను శరవేగంగా పూర్తి చేసి నెలరోజుల్లో అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.


