శాంతి టాకీస్ షూటింగ్ ప్రారంభం
తమిళసినిమా: మంచి కంటెంట్‌తో కూడిన చిత్రాలనం నిర్మిస్తూ వరుసగా విజయాలను సాధిస్తున్న నిర్మాత అరుణ్ విశ్వ. ఈయన ఇటీవల శాంతి టాకీస్ పతాకంపై మావీరన్, 3 బీహెచ్‌కే వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారన్నది గమనార్హం. ప్రస్తుతం విక్రమ్ 63వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా తాజాగా తమ సంస్థలో నాల్గవ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో వర్ధమాన నటుడు భరత్ హీరోగా నటిస్తున్నారు. ఈయనకు జంటగా శాన్వీమేఘ్నా నటిస్తున్నారు.ఈ చిత్రానికి హరిహరసుధన్ అళగిరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. చిత్ర షూటింగ్‌ను పట్టికోటై పరిసర ప్రాంతాలలో 45 నుంచి 50 రోజుల్లో పూర్తి చేసే విధంగా ప్రణాళికను రచించినట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి. నటుడు ఫాలొ శరవణన్ ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి తేనీ ఈశ్వర్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఇతర నటీనటులు సాంకేతిక వర్గాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.


