గుండె మార్పిడిలో కొత్త మైలురాయి
సాక్షి, చైన్నె : గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సల్లో సరికొత్త మైలురాయిని సాధించామని అపోలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీనివాస్‌రాజ గోపాల్ తెలిపారు. 600లకు పైగా జరిగిన గుండెమార్పిడి, ఊపిరితిత్తుల మార్పిడి, 1000కి పైగా ఎక్మో కేసులతో అధునాతన క్రిటికెల్ కేర్‌లో సాధించిన మైలురాయి గురించి గురువారం స్థానికంగా ప్రకటించారు. స్థిరమైన, అధిక సర్వైవల్ ఫలితాలు చైన్నెలోని అపోలో ఆస్పత్రి అధునాతన గుండె, ఊపిరితిత్తుల వైఫల్య నిర్వహణలో అగ్రగామిగా మారిందని వివరించారు. తాజాగా అత్యవసర డబుల్ లండ్ మార్పిడి చేయించుకునేందుకు ముందు 48 రోజుల పాటు ఎక్మో మద్దతుతో క్లిష్టమైన దశలో బయట పడిన రాజా శివగురునాథన్(59), బి.శరవణన్(45), రాధే శ్యామ్ రఘువంశి(72)లకు తాము అందించిన అధునాతన డబుల్ లండ్ మార్పిడి గురించి ప్రస్తావించారు. ఊపిరితిత్తుల మార్పిడి విభాగాధిపతి డాక్టర్ కుముద్ కుమార్ దితల్ మాట్లాడుతూ, గుండె, ఊపిరి చిత్తుల వైఫల్యంతో బాధ పడుతున్న రోగులకు వైద్య చికిత్స పెరుగుతున్న కొద్ది జీవన నాణ్యత క్షీణిస్తున్నందన, ముందుగానే మార్పిడి ఎంపికల గురించి తెలుసుకోవాల్సిన అవశ్యం ఉందని వివరించారు. అపోలో చైన్నె రీజియన్ సీఈఓ డాక్టర్ ఇలంకుమరన్‌క లియమూర్తి పాల్గొన్నారు.


