బయోప్రోస్థటిక్ వాల్వ్ రఫ్రాక్చర్‌కు ఆధునిక చికిత్స
సాక్షి, చైన్నె: బయోప్రోస్థటిక్ వాల్వ్ ఫ్రాక్చర్, డ్యూయల్ సెబ్రల్ ప్రొటెక్షన్‌తో సంక్లిష్ట టీఏవీఆర్ ఇన్ టీవీఆర్ ఇన్ ఎస్‌ఏవీఆర్ ప్రక్రియను చైన్నె వైద్యులు విజయంతం చేశారు. ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రిలో జరిగిన ఈ ఆధునిక విధానంపై డాక్టర్ రాజారామ్ అనంతరామన్ మాట్లాడుతూ 78 సంవత్సరాల వ్యక్తికి తీవ్రమైన బృహద్ధమని స్టెనోసిస్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. 2005లో ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగి ఉండడం, 2019లో ట్రాన్స్ కాథెటర్ వాల్వ్ ఇన్ వాల్వ్ రీ ప్లేస్ మెంట్ జరిగి ఉండడంతో తాజాగా పరిస్థితి సంక్లిష్టంగా మారిందన్నారు. అధునాతన 3డీ ఎకోకార్డియోగ్రఫీ, సీటీ ఇమేజింగ్ ఉపయోగించి టీఏవీఆర్ ఇన్ టీఏవీఆర్ ఇన్ ఎస్‌ఏవీఆర్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించామని వివరించారు. శస్త్ర చికిత్స వాల్వ్ లోపల గతంలో అమర్చిన ట్రాన్స్ కాథెటర్ వాల్వ్ లోపల కొత్త ట్రాన్స్ కాథెటర్ వాల్వ్‌ను ఈ ప్రక్రియ ద్వారా విజయవంతంగా పొందు పరిచినట్టు తెలిపారు. కావేరి గ్రూప్ సహ వ్యవస్థాపకుడు అరవిందన్ సెల్వరాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


