తిరుప్పూరులో మానసిక రోగి వీరంగం | - | Sakshi
Sakshi News home page

తిరుప్పూరులో మానసిక రోగి వీరంగం

Jan 23 2026 7:00 AM | Updated on Jan 23 2026 7:00 AM

తిరుప

తిరుప్పూరులో మానసిక రోగి వీరంగం

సేలం : తిరుప్పూర్‌ జిల్లా కలెక్టరేట్‌ సమీపంలో సినిమా పాటల రచయిత వైరముత్తును న్యాయవాదులు స్వాగతిస్తున్న సమయంలో జనంపైకి బూటు విసరడంతో గందరగోళం నెలకొంది. గురువారం ఉదయం తిరుప్పూర్‌ జిల్లా కలెక్టరేట్‌ సమీపంలో 50 ఏళ్ల మహిళ అకస్మాత్తుగా రోడ్డుపై కూర్చుని ఆందోళన చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఆ సమయంలో భద్రతా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు ఆ మహిళను అక్కడి నుంచి తరలించారు. విచారణలో, ఆ మహిళ పేరు జయ అని, ఆమె మానసిక రోగి అని, ఏ ప్రభుత్వం కూడా ఆమె డిమాండ్లను నెరవేర్చకపోవడంతో ఆమె తరచూ ఇలాంటి సంఘటనలకు పాల్పడుతోందని తెలిసింది. ఈ పరిస్థితిలో, కవి, పాటల రచయిత వైరముత్తు కొంగు కలై సాహిత్య సాంసృతిక వేదిక ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి తిరుప్పూర్‌ వచ్చారు. కలెక్టర్‌ సమీపంలో న్యాయవాదుల సంఘం ఆయనకు పూలమాల వేసి స్వాగతం పలికింది. ఆ సమయంలో ఆందోళన చేస్తున్న మానసిక రోగి అయిన మహిళ అకస్మాత్తుగా తాను ధరించిన బూటును తీసి వైరముత్తును స్వాగతిస్తున్న జనంపై విసిరింది. న్యాయవాదులు వైరముత్తును సురక్షితంగా వేదిక వద్దకు తీసుకెళ్లారు.

తిరుప్పూరులో మానసిక రోగి వీరంగం1
1/1

తిరుప్పూరులో మానసిక రోగి వీరంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement