రథసప్తమికి సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రథసప్తమికి సర్వం సిద్ధం

Jan 23 2026 7:00 AM | Updated on Jan 23 2026 7:00 AM

రథసప్తమికి సర్వం సిద్ధం

రథసప్తమికి సర్వం సిద్ధం

తిరుమల: రథ సప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఆయన టీటీడీ ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, శ్రీమతి పనబాక లక్ష్మి, అదనపు ఈఓ సి.హెచ్‌.వెంకయ్య చౌదరిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రథ సప్తమి సందర్భంగా భక్తుల కోసం టీటీడీ చేసిన ఏర్పాట్లను చైర్మన్‌ వివరించారు.

సమావేశంలోని ముఖ్యాంశాలివీ..

● ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం

● 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం

● 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం

● మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం

● మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం

● సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం

● సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం

● రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ నిర్వహిస్తారు.

● ఈ నెల 25వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రివిలేజ్‌ దర్శనాలు, ప్రోటోకాల్‌ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.

● తిరుపతిలో జనవరి 24 నుంచి 26వ తేది వరకు స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు.

● రథ సప్తమి రోజు భక్తులకు పంపిణీ చేసేందుకు 14 రకాల మెనూ తయారీ. గ్యాలరీల్లోని భక్తులందరికీ 85 ఫుడ్‌ కౌంటర్ల ద్వారా అన్న ప్రసాదాలు వితరణ.

● సుమారు 3700 మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు

● గత సంవత్సరం ఏపీఎస్‌ఆర్టీసీ 1900 ట్రిప్పులను నడపగా, ఈ ఏడాది 2300 ట్రిప్పులు నడిపేందుకు చర్యలు.

ఈ సమావేశంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, సీఈ సత్య నారాయణ, డిప్యూటీ ఈఓ లోకనాథం, రాజేంద్ర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement