నకిలీ రూ.200నోట్లు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

నకిలీ రూ.200నోట్లు స్వాధీనం

Jan 23 2026 7:00 AM | Updated on Jan 23 2026 7:00 AM

నకిలీ రూ.200నోట్లు స్వాధీనం

నకిలీ రూ.200నోట్లు స్వాధీనం

● ఇద్దరి అరెస్ట్‌

అన్నానగర్‌: తిరుచ్చి సమీపంలో కారులో తరలిస్తున్న రూ.8.5 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి జిల్లా దువాక్కుడిలోని బ్లాక్‌ టెంపుల్‌ సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద బుధవారం రాత్రి విదేశీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉన్న కారు పెట్రోల్‌ పట్టుకోవడానికి ఆగింది. పెట్రోలు పట్టుకొని కారులో వచ్చిన వారు రూ.2,600 చెల్లించారు. అందులో నకిలీ రూ.200 నోట్లు ఉన్నాయని గుర్తించిన పెట్రోల్‌ బంక్‌ ఉద్యోగి వెంటనే దువాక్కుడి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. కానీ అప్పటికే కారు అక్కడి నుంచి బయలుదేరి తిరుచ్చి వైపు వెళుతోంది. పోలీసులు కారును వెంబడించారు. చెక్‌ పోస్ట్‌ వద్ద వాహనాన్ని ఆపి తనిఖీ చేయాలని చెక్‌పోస్ట్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు కారును ఆపి తనిఖీ చేశారు. తనిఖీల్లో 2 బస్తాల నకిలీ రూ.200 నోట్లు ఉన్నట్లు గుర్తించారు. రూ.8 లక్షల 37 వేల 800 విలువైన నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు నకిలీ నోట్లను, కారును స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. విచారణలో వారు మహారాష్ట్రకు చెందిన రమేష్‌ బాబరో బహిర్‌ (54), నారాయణ రామ్‌ (34) గా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement